For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  20 years of nuvvu naku nachav: కలెక్షన్స్ తో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన సినిమా.. ఫస్ట్ వెంకీని అనుకోలేదట!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు . అందులో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఏ హీరోకైనా సరే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఎంతోకొంత నెగిటివ్ కామెంట్స్ చేసే వారు కూడా ఉంటారు. కానీ వెంకటేష్ కు మాత్రమే అసలు నెగిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేదే ఉండదు. సినిమా బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా సినిమా చూడడానికి ఇష్టపడతారు. ఆ విధమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సెట్ చేసిన సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ సినిమా చాలా బాగా హెల్ప్ చేసింది.

  ఈ సినిమాతో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు సినిమా విశేషాలపై అనేక రకాలుగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఒక బెస్ట్ కామెడీ మూవీగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా చిత్ర సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

  ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు

  ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు

  2001 సెప్టెంబర్ 6న విడుదల అయిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఎవరు ముందుగా ఊహించలేదు. ఒక ఫ్యామిలీ డ్రామా తరహాలోనే ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు వారాలు గట్టిగా హడావుడి చేస్తుందని అనుకున్నారు. నిజానికి చిత్ర యూనిట్ కూడా సినిమా సక్సెస్ ఆ తరహాలో ఉంటుందని అసలు ఊహించలేదు.

  ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. ప్రకాష్ రాజ్ వెంకీ మధ్యలో వచ్చే సన్నివేశాలు అలాగే బ్రహ్మానందం కామెడీ సీన్స్, సునీల్ కామెడీ టైమింగ్ త్రివిక్రమ్ పంచులు కూడా సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతోనే కాజల్ అగర్వాల్ కూడా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

  కథ నచ్చగానే అడ్వాన్స్ ఇచ్చేసి..

  కథ నచ్చగానే అడ్వాన్స్ ఇచ్చేసి..

  ఇక ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు అనే వివరాల్లోకి వెళితే నువ్వు నాకు నచ్చావ్ సినిమా కంటే ముందు దర్శకుడు విజయభాస్కర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వేకావాలి సినిమా భారీ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు విజయభాస్కర్ వీలైనంత వరకు తన సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను రైటర్ గా పెట్టుకునేవారు. నువ్వే కావాలి అనంతరం మంచి సినిమా చేయాలని రెండు నెలలు కష్టపడి నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథను సరదాగా రాసుకున్నారు. త్రివిక్రమ్ ఈ కథను నిర్మాత రవి కిషోర్ కు చెప్పగానే వెంటనే ఓకే చెప్పారు. కథ నచ్చగానే రచయితకి దర్శకుడికి ఆయన 20 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు.

  మొదట ఆ హీరోను అనుకున్నారు..

  మొదట ఆ హీరోను అనుకున్నారు..

  ఇక కథ మొత్తం సెట్ అయిన తర్వాత మొదట ఈ సినిమాలో హీరో తరుణ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారట. కానీ ఆ తర్వాత స్రవంతీ రవికిషోర్ దర్శకుడు విజయభాస్కర్ ఈ సినిమాకు పెద్ద హీరో అయితే బాగుంటుందని ఆలోచించారట. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ సలహా అడిగేసరికి వెంకటేష్ కు అయితే సెట్ అవుతుందని చెప్పాడట.

  అతని బాడీ లాంగ్వేజ్ కు కూడా ఈ స్టోరీ మ్యాచ్ చేయగలిగితే మరొక లెవల్లో ఉంటుందని ముందుగానే ఊహించడంతో దర్శకుడు విజయభాస్కర్ కూడా త్రివిక్రమ్ సలహా మేరకు వెంకటేష్ డేట్స్ అడిగి తీసుకున్నారు.వెంకీ కూడా కథ వినగానే వెంటనే ఓకే చెప్పేశాడు.

  ప్రకాష్ రాజ్ ను అనుకోలేదట

  ప్రకాష్ రాజ్ ను అనుకోలేదట

  ఇక సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన అనంతరం రెండు నెలల సమయంలోనే పూర్తి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రకాష్ రాజ్ పాత్ర కోసం నాజర్ లేదా మరొక సీనియర్ నటుడిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారట. అప్పట్లో ఒక వివాదం కారణంగా ప్రకాష్ రాజ్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. ఆ వివాదం చర్చల దశలో ఉండగానే ముందుగా సినిమా షూటింగ్ మొదలు పెట్టి చివరికి ప్రకాష్ రాజ్ సన్నివేశాలను పూర్తి చేయాలని అనుకున్నారు. అన్ని అనుకున్నట్లుగానే విజయవంతంగా పూర్తయ్యాయి.

  బ్రహ్మానందం పాత్ర అసలు కథతోనే లేదు

  బ్రహ్మానందం పాత్ర అసలు కథతోనే లేదు

  అసలైతే ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రను ముందుగా రాసుకోలేదట. షూటింగ్ మధ్యలోనే హీరో వెంకటేష్ త్రివిక్రమ్ కు ప్రత్యేకంగా మాట్లాడి బ్రహ్మానందం కోసం ఏదైనా పాత్రను క్రియేట్ చేయమని సలహా ఇచ్చాడట. ఇక సెకండాఫ్ లో అయితే బాగుంటుంది అని చెప్పడంతో మిస్టర్ బీన్ పాత్ర ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన పాత్రను క్రియేట్ చేశాడు.

  బ్రహ్మానందం సీన్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్లో పగలబడి నవ్వారు. మొత్తంగా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చిరునవ్వులతోనే కనిపించారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంది.

  Prabhas కి హాట్సాఫ్.. Megastar Chiranjeevi మాస్ హీరో - Harbhajan Singh
  బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

  బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

  ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం వెంకటేష్ అయితే మొదట రెమ్యునరేషన్ విషయం తీసుకోలేదట. లాభాల్లో వాటా ఇస్తామని అన్నారట. ఇక చాలా తక్కువ బడ్జెట్లోనే సినిమాను నిర్మించాలని అనుకున్నారు. రెండు కోట్లతోనే పూర్తిచేయాలని అనుకోగా ఆ తర్వాత అందమైన పాటల కోసం విదేశాలకు వెళ్లడంతో కాస్త బడ్జెట్ ఎక్కువ అయ్యింది.

  మొత్తంగా నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. సినిమాకు మొత్తంగా 18 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పెట్టిన పెట్టుబడికి సినిమా భారీ స్థాయిలో లాభాలు అందించడంతో ఆ తర్వాత త్రివిక్రమ్, డైరెక్టర్ కె విజయ భాస్కర్ స్థాయి కూడా అంతగా పెరిగి పోయింది. ఆ తర్వాత నాగార్జున నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో మన్మధుడు సినిమాను తెరపైకి తీసుకువచ్చారు.

  English summary
  20 years of nuvvu nak nachav box office collections.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X