2014: మొత్తం మెగా క్యాంప్ హీరోలదే (ఫొటో ఫీచర్)
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ లో 2014 సంవత్సరం మెగా హీరోలదే అని చెప్పాలి. ఎందుకంటే వీరి హీరోలు సినిమాలు వరసగా రిలీజవుతూ హిట్టవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ క్యాంప్ నుంచి ఇద్దరు కొత్త హీరోలు వచ్చారు.
సాయి ధరమ్ తేజ(చిరు మేనల్లుడు)వరుణ్ తేజ్(నాగ బాబు కుమారుడు) వీరిద్దరు సినిమాలూ 2014లోనే ఉండటం విశేషం. ఇప్పటికే సాయి ధరమ్ తేజ పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం రిలీజై హిట్టైంది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ ముకుందా మీదా ఉంది. వరుణ్ తేజ ఈ చిత్రంలో అదరకొట్టాడని అంతర్గత వర్గాల సమచారం.
ఇక మెగా హీరోల పరిస్ధితి చూస్తూంటే 2015 లో కూడా వరసగా వీళ్లు సినిమాలు రెండు నెలలకు ఒకటి చొప్పున కనపడేటట్లు ఉంది. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల తో మొదలయ్యి...గబ్బర్ సింగ్ తో ముగిసేటట్లు ఉంది. అంతేకాదు వచ్చే సంవత్సరం చిరు చిత్రం కూడా ఉండే అవకాసం ఉంది.
స్లైడ్ షో లో 2014లో వచ్చిన మెగా హీరోల చిత్రాలు గురించి...

ఎవడు
రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయమే సాంధించింది. దానికి తోడు మహేష్ బాబు చిత్రం ఫెయిల్యూర్ కావటం కూడా సంక్రాంతి భాక్సాఫీస్ ని దున్నటానికి ఉపకరించింది.

గోవిందుడు అందరి వాడేలే
దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ స్టామినాతో ఓపినింగ్స్ రాబట్టినా కలెక్షన్స్ పరంగా సెకండ్ వీక్ కే డ్రాప్ అయ్యిపోయింది. అయితే నిర్మాత సేఫ్ జోన్ లో బయిటపడ్డాడని ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.

రేసు గుర్రం
అల్లు అర్జున్ చిత్రం రేసు గుర్రం ఈ సంవత్సరం హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అల్లు అర్జున్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది.

కొత్త జంట
అల్లు శిరీష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగానే కలెక్టు చేసింది. అయితే ఎక్సపెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేకపోయింది.

పిల్లా నువ్వు లేని జివితం
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా లాంచ్ అవుతూ చేసిన చిత్రం రేయ్ ఆగిపోయినా ఈ చిత్రం తొలి లాంచింగ్ చిత్రంగా విడుదలైంది. ఎక్సపెక్టేషన్స్ కు తగ్గట్లే హిట్ అనిపించుని కలెక్షన్స్ కురిపిస్తోంది.

ముకుందా
నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ ని హీరోగా లాంచ్ చేస్తూ రూపొందిన చిత్రం ముకుందా. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కిస్మస్ కానుకగా విడుదల అవుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

అల్లు అర్జున్- త్రివిక్రమ్
ఇక వచ్చే సంవత్సరం అల్లు అర్జున్ కొత్త చిత్రం విడుదల అవుతుంది. ఈ మేరకు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చిత్రం తెరకెక్కుతోంది.

సాయి ధరమ్ తేజ
హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం రూపొందుతూ ఈ రోజే ఓపినింగ్ అయ్యింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.

పవన్ ఏడి
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం తర్వాత ఏ చిత్రమూ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం ఆయన చిత్రం ఏమీ రాలేదు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో గోపాల గోపాల చిత్రం చివర్లో గబ్బర్ సింగ్ 2 విడుదల కానున్నాయి.

చిరంజీవి
ఈ సంవత్సరం చిరంజీవి 150 వ చిత్రం ప్రకటిస్తాను అన్నారు కానీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. అయితే వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే రిలీజ్ కూడా వచ్చే సంవత్సరమే అన్నమాట.


Click it and Unblock the Notifications











