For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014: తెలుగు స్టార్ హీరోలు హిట్లు-ఫట్ లు(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: 2014 సంవత్సరం ముగింపుకొచ్చింది. ఈ సంవత్సరం తెలుగులో పెద్ద హిట్ లూ వచ్చాయి. అదే రేంజిలో ఫ్లాపులూ వచ్చాయి. అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా కొట్టాయి. క్రేజ్ లేకుండా వచ్చినవి రికార్డులు బ్రద్దులు కొట్టి అందరికీ షాక్ ఇచ్చాయి.

  ముఖ్యంగా ఈ సంవత్సరం సీనియర్ హీరోలదే అని చెప్పాలి. సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మళ్లీ హిట్టులతో తమ సత్తా చూపించిన సంవత్సరం ఇది. అలాగే ఎప్పటిలాగే భాక్సాఫీస్ వద్ద మాస్ సినిమాలే ఆడాయి. దాంతో మాస్ సినిమాలకే జనం మరోసారి పట్టం కట్టినట్లైంది.

  https://www.facebook.com/TeluguFilmibeat

  అలాగే ఎంటర్టైన్మెంట్ తో పాటు...సెంటిమెంట్ సైతం ఈ సంవత్సరం బాగా పండింది. ఈ రెండు కలగలిసిన చిత్రాలు జనాలకు బాగా పట్టాయి. ప్యూర్ లవ్ స్టోరీలకు అసలు వర్కవుట్ కాలేదు. చిన్న సినిమాలు సైతం సందడి బాగానే చేసి చిన్న నిర్మాతలకు ఊపిరి పోసాయి.

  అంతేకాగు... పెద్ద హీరోలు నటించిన పదింటిలో ఆరు సినిమాలు బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రేక్షకులను అధిక సంఖ్యలో థియేటర్లకు రప్పించగలిగే ఛరిష్మా తమకు ఉందని వీరు ప్రూవు చేసారు. అలాగే...తెలుగులో పదిమంది ఉండగా ఈ ఏడాది ఇద్దరు స్టార్లు ప్రేక్షకుల ముందుకు రాలేదు. లేకపోతే మరో రెండు హిట్లు నమోదు అయ్యేవేమో.

  హిట్, ఫట్ హీరోలు లిస్ట్...

  బాలయ్య బాబుదే ఈ సంవత్సరం...

  బాలయ్య బాబుదే ఈ సంవత్సరం...

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేసిన ‘లెజెండ్‌' తో మరోమారు హిట్ కొట్టారు. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కావటం విశేషం. ‘లెజెండ్‌' ఏకంగా సిల్వర్‌ జూబ్లీ నడిచింది. గడచిన ఐదేళ్లలో రెండు సిల్వర్‌ జూబ్లీల (సింహా, లెజెండ్‌) ఏకైక హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ రెండింటికీ సంబంధించిన మరో పోలిక, ఆయన ద్విపాత్రలు పోషించడం.

  ‘రేసుగుర్రం' రికార్డులు

  ‘రేసుగుర్రం' రికార్డులు

  అల్లు అర్జున్‌ కెరీర్‌ బెస్ట్‌గానే కాకుండా ఆల్‌టైమ్‌ టాలీవుడ్‌ టాప్‌ ఫైవ్‌ గ్రాసర్స్‌లో నిలిచిన సినిమా ‘రేసుగుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా బన్నీని మొదటిసారిగా రూ. 50 కోట్ల క్లబ్బులో చేర్చింది.

  రామ్ చరణ్ కు ఒక హిట్ ..ఒక ఫట్

  రామ్ చరణ్ కు ఒక హిట్ ..ఒక ఫట్

  2013 సంక్రాంతికి ‘నాయక్‌'తో విజయాన్ని అందుకొన్న రామ్ చరణ్ ఈ ఏడాదీ ‘ఎవడు' సినిమాతో అదే తరహా లో హిట్ కొట్టి రిపీట్‌ చేశాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి చరణ్‌ హిట్‌ సినిమాల లిస్ట్‌లో ముందు వరుసలో నిలిచింది. అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే' సినిమా, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

  నాగ్ కేక

  నాగ్ కేక

  ‘మనం' సినిమా నాగార్జున కెరీర్‌లో ఓ తీపి జ్ఞాపకంగా, మైలురాయిగా నిలిచిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్రలో స్థానం పొందింది ‘మనం'. అలాగే...తొలిసారిగా ఈ ఏడాది బుల్లితెర మీదా అడుగుపెట్టిన నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షోతో తెలుగు గేమ్‌ షోల చరిత్రలో టీఆర్‌పీ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు.

  విక్టరీ మళ్లీ...

  విక్టరీ మళ్లీ...

  విభిన్నతకు మారు పేరుగా చెప్పబడే వెంకీ... గత ఏడాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి చక్కని కుటుంబ కథాత్మక చిత్రంలో ‘పెద్దోడు'గా ప్రేక్షకుల్ని అలరించిన వెంకటేశ్‌, ఆ తర్వాత ‘షాడో', ‘మసాలా' సినిమాలతో నిరాశపరిచారు. ఈ రెండూ బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాలు చవిచూశాయి. ఓ విజయం తప్పనిసరి అనే పరిస్థితుల్లో ఈ ఏడాది చేసిన ‘దృశ్యం' ఆయనకు సరిగ్గా అలాంటి ఫలితాన్నే ఇచ్చింది. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఒకప్పటి హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకురాలు.

  రవితేజ రచ్చ...

  రవితేజ రచ్చ...

  క్రితం సంవత్సరం ‘బలుపు'తో కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ సాధించి ఉషారుగా ఉన్న రవితేజ, ఈ ఏడాది ‘పవర్‌'తో ఆ జోరును కొనసాగించాడు. స్ర్కిప్ట్‌ రైటర్‌ బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో ఏసీపీ బలదేవ్‌ సహాయ్‌గా, తిరుపతిగా రవితేజ తనదైన శైలి నటనతో అలరించి, మరోసారి ‘మాస్‌ మహారాజా' అనే గుర్తింపుకు న్యాయం చేశాడు.

  మహేష్ .. నిరాశపరిచాడు

  మహేష్ .. నిరాశపరిచాడు

  వాస్తవం చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం అందరికంటే ఎక్కువగా ప్రేక్షకులను,అభిమానులను నిరాశకు గురిచేసింది మహేష్ బాబు‌. సుకుమార్‌ డైరెక్షన్‌లో చేసిన ‘1.. నేనొక్కడినే' బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచింది. నిర్మాతలకూ, బయ్యర్లకూ నష్టాలు మిగిల్చింది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘ఆగడు' సినిమా మహేశ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది.

   ఎన్టీఆర్ దీ అదే పరిస్ధితి

  ఎన్టీఆర్ దీ అదే పరిస్ధితి

  గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఎన్టీఆర్‌. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘బృందావనం' సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ బయ్యర్లకు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. నిరుడు ‘బాద్‌షా' ఓ మోస్తరుగా ఆడిందనుకుంటే, ‘రామయ్యా వస్తావయ్యా' సినిమా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది ‘రభస', మరింత ఘోరంగా బాక్సాఫీస్‌ వద్ద పల్టీకొట్టింది. ‘కందిరీగ' ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాతో నిర్మాత, బయ్యర్లు ఎవరికీ రూపాయి రాలేదు.

  పవన్ కళ్యాణ్...

  పవన్ కళ్యాణ్...

  రికార్డులు సృష్టించిన పవన్‌కల్యాణ్‌ చివరి సినిమా ‘అత్తారింటికి దారేది'పోయినేడు సెప్టెంబర్‌లో రాగా ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రాలేదు. వచ్చే ఏడు వరుసగా ‘గోపాల గోపాల' తో మన ముందుకు వస్తున్నారు.

  ప్రభాస్

  ప్రభాస్

  కమర్షియల్‌గా ప్రభాస్‌ కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ ‘మిర్చి' 2013 ఫిబ్రవరిలో వచ్చింది. ఈ సంవత్సరం ఒక్క సినిమానూ రాలేదు. వచ్చే సంవత్సరం ‘బాహుబలి' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

  English summary
  Like every year in 2014 many Tollywod movies hit the screens amid the high expectations from the Tollywood audience. Those who had a bad last year year came with a bang and those with good success gave duds at the box office.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X