2018 11 Days Collections: సగానికి సగం డౌన్.. అయినా తెలుగులో సెన్సేషన్.. అప్పుడే అన్ని కోట్ల లాభమా!
దక్షిణాదిలోని అన్ని భాషల కంటే మలయాళంలో నేచురల్ స్టోరీలతో సినిమాలు తెరకెక్కుతుంటాయి. వాటికి విశేషమైన ఆదరణ కూడా లభిస్తోంది. ఇటీవలే అలా విడుదలైన సినిమానే '2018'. కేరళలో ప్రళయాన్ని సృష్టించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ సంచలన వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసింది.
దీంతో ఈ సినిమాను తెలుగులోకి బన్నీ వాసు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ మూవీ భారీ వసూళ్లతో సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో '2018' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల కలెక్షన్లను మీరే చూడండి మరి!

నేచురల్ స్టోరీతోనే 2018: మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషించారు.

కేరళలో టాప్ గ్రాస్ మూవీ: 2018లో బీభత్సాన్ని సృష్టించిన వరదల నేపథ్యంతో '2018' మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 172 కోట్లు వరకూ రాబట్టింది. తద్వారా మలయాళంలో టాప్ గ్రాస్ సాధించిన మూవీగా చరిత్రను నమోదు చేసింది.

బన్నీ వాసు తీసుకొచ్చారు: నేచురల్ స్టోరీతో రూపొంది మలయాళంలో సూపర్ హిట్ అయిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రావడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌తో ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

11వ రోజు పెరిగిన వసూళ్లు: ఎమోషనల్ కాన్సెప్టుతో రూపొందిన '2018' మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాకు తెలుగులో వీకెండ్‌లో రెస్పాన్స్ పెరిగింది. ఫలితంగా 10వ రోజు ఈ సినిమా ఏఖంగా రూ. 74 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. కానీ, 11వ రోజు మాత్రం సగానికి సగం డౌన్ అయింది. దీంతో సోమవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 38 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

11 రోజుల్లో ఎంతొచ్చింది?: '2018' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో టాక్‌కు తగ్గట్లుగానే అదిరిపోయే ఆదరణ కొనసాగుతూనే ఉంది. దీంతో పదకొండు రోజుల్లోనే నైజాంలో రూ. 4.56 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 5.04 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 11 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 9.60 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.52 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

తెలుగులో లాభం ఎంత?: ఏపీ, తెలంగాణలో '2018' చిత్రానికి రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ. 4.52 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు రూ. 2.52 కోట్లు లాభాలు వచ్చాయి. దీంతో ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











