2018 Telugu Collections: 1.80 కోట్ల బిజినెస్.. వారంలోనే అన్ని కోట్లు.. బన్నీ వాస్‌కు లాభం ఎంతంటే!

నేచురల్ స్టోరీలతో వచ్చే సినిమాలు ఏ భాషలోనైనా సక్సెస్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలు ఎక్కువగా సౌతిండియా నుంచే వస్తున్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీనే '2018'. కేరళలో ప్రళయాన్ని సృష్టించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో దీన్ని ఇటీవలే తెలుగులోకి విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించిన ఈ సినిమా లాభాల బాటలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో '2018' మూవీ తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల కలెక్షన్లను మీరు కూడా చూడండి!

ఎమోషనల్ కంటెంట్‌తోనే:మలయాళ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రమే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఈ సినిమాలో ముఖ్యమైన రోల్స్ చేశారు.

2018 Movie 1st Week Telugu Box Office Collections

కేరళలో టాప్ గ్రాస్ మూవీ:మే 5వ తేదీన మలయాళంలో '2018' మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్ డేన పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 167 కోట్లు వరకూ రాబట్టి.. అక్కడ టాప్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

తెలుగులో గ్రాండ్ రిలీజ్:తక్కువ బడ్జెట్‌తోనే వచ్చిన మలయాళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌తో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

2018 Movie 1st Week Telugu Box Office Collections

7వ రోజు తగ్గిపోయింది:ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన '2018' మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాకు తెలుగులో 6 రోజు స్పందన తగ్గిపోయింది. ఫలితంగా ఆరో రోజు రూ. 71 లక్షలు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. ఏడో రోజు మాత్రం మరికొంత తగ్గిపోయింది. దీంతో గురువారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 61 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

2018 Movie 1st Week Telugu Box Office Collections

వారంలో ఎంతొచ్చిందంటే:'2018' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో టాక్‌కు తగ్గట్లుగానే అదిరిపోయే ఆదరణ లభిస్తూనే సాగిపోతోంది. దీంతో వారం రోజుల్లో నైజాంలో రూ. 3.45 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 3.95 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 7 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 7.40 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.50 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

2018 Movie 1st Week Telugu Box Office Collections

తెలుగులో లాభం ఎంత?:'2018' సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ. 3.50 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు '2018' సినిమాకు రూ. 1.50 కోట్లు లాభాలు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X