2018 Telugu Collections: తెలుగులో 2018 సంచలనం.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. 72 లక్షలు వస్తే రికార్డు
మిగిలిన భాషలతో పోల్చుకుంటే మలయాళంలో నేచురల్ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే '2018'. ఆ మధ్య కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం మూడు వారాల క్రితమే మలయాళంలో విడుదలైంది. అక్కడ దీనికి భారీ స్పందన రావడంతో వసూళ్లు పోటెత్తాయి. దీంతో అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో '2018' మూవీ రెండు రోజుల తెలుగు కలెక్షన్లను మీరే చూడండి!
2018 మూవీతో సెన్సేషన్‌గా: మలయాల స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

కేరళలో టాప్ గ్రాస్ మూవీగా: '2018' మూవీ మే 5వ తేదీన కేరళలో విడుదలైంది. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్ డేన పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత విశేషంగా పుంజుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా అక్కడ రూ. 155 కోట్లు రాబట్టి.. మలయాళంలో టాప్ గ్రాసర్‌గా నిలిచింది.

గీతా ఆర్ట్స్ తీసుకొచ్చిందిగా: ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి మలయాళంలో సంచలన విజయం సాధించిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.
2వ రోజు సంచలనంగానే: 2018లో కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల నేపథ్యంలో రూపొందిన చిత్రమే '2018'. నేచురల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో రెండో రోజు భారీ స్పందన లభించింది. ఫలితంగా రూ. 1.02 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు భారీగా పుంజుకుంది. ఫలితంగా దీనికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 1.71 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజుల్లో ఎంతొచ్చిందంటే: యూనివర్శల్ కాన్సెప్టుతో వచ్చిన '2018' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ లభించింది. దీంతో 2 రోజుల్లో నైజాంలో రూ. 1.15 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 1.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 2 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.73 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.28 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.
తెలుగులో హిట్ అవ్వాలంటే: '2018' సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో రూ. 1.80 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ. 1.28 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. ఇంకా ఇది రూ. 72 లక్షలు వసూలు చేస్తేనే క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. తద్వారా తెలుగులోనూ విజేతగా నిలిచి రికార్డును సాధిస్తుంది.


Click it and Unblock the Notifications











