2018 Telugu Collections: 2018 మూవీకి భారీ వసూళ్లు.. 4రోజుల్లోనే అన్ని కోట్లు.. తెలుగులో లాభం ఎంతంటే!
ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న సినిమాల్లో '2018' ఒకటి. కేరళలో ఐదేళ్ల క్రితం వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. మలయాళంలో పెను సంచలనం సృష్టించింది. అక్కడ కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ టాప్ గ్రాసర్‌గా నిలిచింది.
దీంతో ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా దీనికి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో '2018' మూవీ 4 రోజుల తెలుగు కలెక్షన్లను మీరే చూడండి!

సంచలనంగా 2018 మూవీ: టాలెంటెడ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఇందులో కీలక పాత్రలను పోషించారు.

కేరళలో టాప్ గ్రాస్ మూవీ: మే 5వ తేదీన '2018' మూవీ మలయాళంలో విడుదలైంది. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్ డేన పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత పుంజుకున్న ఈ చిత్రం ఏకంగా అక్కడ రూ. 157 కోట్లు వరకూ రాబట్టి.. అక్కడ టాప్ గ్రాసర్‌గా రికార్డును సాధించింది.

తెలుగులో గ్రాండ్ రిలీజ్: చిన్న బడ్జెట్‌తో వచ్చి మలయాళంలో సంచలన విజయం సాధించిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని గ్రాండ్‌గా విడుదలైంది.

4వ రోజు హోల్డ్ చేసినా: కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ మూవీనే '2018'. నేచురల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో 4 రోజు స్పందన తగ్గిపోయింది. ఫలితంగా మూడో రోజు రూ. 1.60 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. నాలుగో రోజు మాత్రం బాగానే హోల్డ్ చేసింది. దీంతో సోమవారం దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 91 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

4 రోజుల్లో ఎంతొచ్చిందంటే: మంచి కాన్సెప్టుతో రూపొందిన '2018' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ లభించింది. దీంతో 4 రోజుల్లో నైజాంలో రూ. 2.40 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 2.84 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 4 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.24 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.46 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

తెలుగులో లాభం ఎంత?: ఆంధ్రా, తెలంగాణలో '2018' సినిమాకు రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ. 2.46 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు '2018' సినిమాకు రూ. 46 లక్షలు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











