2018 Telugu Collections: ఆ మార్క్ దాటిన 2018.. 5 రోజుల్లో ఊహించని విధంగా.. బన్నీ వాసుకు జాక్‌పాట్
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళంలో వచ్చే సినిమాలు ఎంతో నేచురల్‌గా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఇటీవలే ఆ భాషలో వచ్చిన చిత్రమే '2018'. కేరళ రాష్ట్రంలో ప్రళయాన్ని సృష్టించిన వరదల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ అక్కడ అత్యధిక కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది.
ఈ క్రమంలోనే గత వారంలోనే తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైంది. ఇక్కడ కూడా దీనికి భారీ వసూళ్లు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో '2018' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల కలెక్షన్లను మీరే చూడండి మరి!

ఎమోషనల్ స్టోరీతో 2018: మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా నటించిన సినిమానే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రల్లో కనిపించారు.

కేరళలో టాప్ గ్రాస్ మూవీ: '2018' మూవీ మే 5వ తేదీన మలయాళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్ డేన పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 158 కోట్లు వరకూ రాబట్టి.. అక్కడ టాప్ గ్రాసర్‌గా సంచలనం సృష్టించింది.

తెలుగులో గ్రాండ్ రిలీజ్: చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చి మలయాళంలో సంచలన విజయం సాధించిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని రిలీజ్ అయింది.

5వ రోజు హోల్డ్ చేసినా: 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ మూవీనే '2018'. నేచురల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో 5 రోజు స్పందన తగ్గిపోయింది. ఫలితంగా నాలుగో రోజు రూ. 91 లక్షలు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. ఐదో రోజు మాత్రం బాగానే హోల్డ్ చేసింది. దీంతో మంగళవారం దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 84 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
5 రోజుల్లో ఎంతొచ్చిందంటే: '2018' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే ఆదరణ లభిస్తూనే సాగిపోతోంది. దీంతో 5 రోజుల్లో నైజాంలో రూ. 2.79 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 3.29 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 5 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 6.08 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.87 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

తెలుగులో లాభం ఎంత?: '2018' సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ. 2.87 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు '2018' సినిమాకు రూ. 87 లక్షలు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











