2018 Telugu Collections: 6 రోజుల్లోనే అన్ని కోట్లు.. తెలుగులో 2018 మరో సంచలనం.. లాభాలతో రికార్డు
కంటెంట్ బాగుంటే ఎంత బడ్జెట్ సినిమా అనేది పక్కన పెట్టేసి మరీ సినీ ప్రియులు ఆదరిస్తున్నారు. అలా అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చి మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే '2018'. కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన వరదల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో గత వారంలోనే దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. మన దగ్గర కూడా ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో '2018' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల కలెక్షన్లను మీరు కూడా చూడండి మరి!
కనెక్ట్ అయ్యే కథతో 2018: టాలెంటెడ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రను చేసిన సినిమానే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు చేశారు.

కేరళలో టాప్ గ్రాస్ మూవీ: మలయాళంలో '2018' మూవీ మే 5వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్ డేన పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 165 కోట్లు వరకూ రాబట్టి.. అక్కడ నెంబర్ వన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

తెలుగులో గ్రాండ్ రిలీజ్: కేవలం రూ. 15 కోట్లు బడ్జెట్‌తో వచ్చి మలయాళంలో సంచలన విజయం సాధించిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌తో రిలీజ్ అయింది.

6వ రోజు హోల్డ్ చేసినా: కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన నేచురల్ మూవీనే '2018'. నేచురల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు తెలుగులో 6 రోజు స్పందన తగ్గిపోయింది. ఫలితంగా ఐదో రోజు రూ. 84 లక్షలు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. ఆరో రోజు మాత్రం బాగానే హోల్డ్ చేసింది. అయినప్పటికీ బుధవారం దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 71 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

6 రోజుల్లో ఎంతొచ్చిందంటే: తెలుగు రాష్ట్రాల్లో '2018' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే అదిరిపోయే ఆదరణ లభిస్తూనే సాగిపోతోంది. దీంతో 6 రోజుల్లో నైజాంలో రూ. 3.16 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 3.63 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 6 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 6.79 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.20 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.
తెలుగులో లాభం ఎంత?: ఆంధ్రా, తెలంగాణలో '2018' సినిమాకు రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం ఆరు రోజుల్లోనే రూ. 3.20 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు '2018' సినిమాకు రూ. 1.20 కోట్లు లాభాలు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











