2018 Telugu Collections: 8వ రోజూ భారీగానే.. అన్ని కోట్లతో అరాచకం.. బన్నీ వాస్‌కు కోట్ల జాక్‌పాట్
కంటెంట్ బాగుంటే ఎలాంటి బడ్జెట్ సినిమాలనైనా, ఏ భాషలో తెరకెక్కిన చిత్రాలనైనా, చిన్న పెద్ద హీరోలు నటించిన మూవీలనైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను హిట్ చేసి నిరూపించారు. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన '2018' అనే మలయాళ మూవీని సైతం మన ఆడియెన్స్ అక్కున చేర్చుకుని విజయాన్ని అందించారు. మొదటి వారంలో సత్తా చాటిన ఈ చిత్రం.. రెండో వారంలోనూ మంచిగానే స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో '2018' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల కలెక్షన్లను మీరు కూడా చూడండి!
వరదల బ్యాగ్‌డ్రాప్‌తో 2018: కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంతో టోవినో థామస్ హీరోగా చేసిన చిత్రమే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఈ సినిమాలో నటించారు.

కేరళలో టాప్ గ్రాస్ మూవీ: ఏమాత్రం అంచనాలు లేకుండానే మలయాళంలో '2018' మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 168 కోట్లు వరకూ రాబట్టింది. తద్వారా మలయాళంలో టాప్ గ్రాస్ సాధించిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

తెలుగులో బన్నీ వాస్‌తో: చిన్న బడ్జెట్‌తో వచ్చిన మలయాళంలో సంచలనంగా నిలిచిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌తో ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.
8వ రోజు తగ్గిపోయింది: నేచురల్ స్టోరీతో తెరకెక్కిన '2018' మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాకు తెలుగులో క్రమంగా రెస్పాన్స్ తగ్గినా వసూళ్లు మాత్రం బానే వస్తున్నాయి. ఫలితంగా 7వ రోజు రూ. 61 లక్షలు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. ఏడో రోజు మాత్రం మరికొంత తగ్గిపోయింది. దీంతో శుక్రవారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 52 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

8 రోజుల్లో ఎంతొచ్చింది?: తెలుగు రాష్ట్రాల్లో '2018' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే అదిరిపోయే ఆదరణ లభిస్తూనే సాగిపోతోంది. దీంతో ఎనిమిది రోజుల్లో నైజాంలో రూ. 3.88 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 4.24 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 8 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8.12 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.74 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

తెలుగులో లాభం ఎంత?: '2018' చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ. 3.74 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు '2018' సినిమాకు రూ. 1.74 కోట్లు లాభాలు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











