2018 Telugu Collections: 9వ రోజు పెరిగిన వసూళ్లు.. లక్ష వస్తే పెను సంచలనం.. టోటల్ కలెక్షన్లు చూస్తే!

మిగిలిన వాటి కంటే ఎమోషనల్ లేదా నేచురల్ స్టోరీలతో వచ్చే చిత్రాలకు ఏ భాషలోనైనా ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇలా సౌతిండియాలోనే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన చిత్రమే '2018'.

కేరళలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో గత వారంలోనే దీన్ని తెలుగులోకి విడుదల చేయగా.. ఇక్కడా మంచి సక్సెస్‌ను అందుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో '2018' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల కలెక్షన్లను మీరే చూడండి!

2018 Movie 9 Days Telugu Box Office Collections

సెన్సేషన్ మూవీగా 2018: మలయాళ టాలెంటెడ్ స్టార్ టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఈ సినిమాలో నటించారు.

2018 Movie 9 Days Telugu Box Office Collections

కేరళలో టాప్ గ్రాస్ మూవీ: పెద్దగా అంచనాలను ఏర్పరచుకోకుండానే మలయాళంలో '2018' మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 170 కోట్లు వరకూ రాబట్టింది. తద్వారా మలయాళంలో టాప్ గ్రాస్ సాధించిన మూవీగా రికార్డును సృష్టించింది.

2018 Movie 9 Days Telugu Box Office Collections

తెలుగులోకి బన్నీ వాస్‌: ఎమోషనల్ కంటెంట్‌తో రూపొంది మలయాళంలో సూపర్ హిట్ అయిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రావడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌తో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

2018 Movie 9 Days Telugu Box Office Collections

9వ రోజు పెరిగిన వసూళ్లు: వరదల నేపథ్యంతో రూపొందిన '2018' మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాకు తెలుగులో క్రమంగా రెస్పాన్స్ తగ్గినా.. 9వ రోజు కాసింత పెరిగింది. ఫలితంగా 8వ రోజు రూ. 51 లక్షలు గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా.. 9వ రోజు మాత్రం మరికొంత రాబట్టుకుంది. దీంతో శనివారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 56 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

9 రోజుల్లో ఎంతొచ్చింది?: '2018' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో టాక్‌కు తగ్గట్లుగానే అదిరిపోయే ఆదరణ లభిస్తూనే సాగిపోతోంది. దీంతో తొమ్మిది రోజుల్లో నైజాంలో రూ. 3.95 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 4.53 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా 9 రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8.48 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.99 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

2018 Movie 9 Days Telugu Box Office Collections

తెలుగులో లాభం ఎంత?: ఆంధ్రా, తెలంగాణలో '2018' చిత్రానికి రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం 9 రోజుల్లోనే రూ. 3.99 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు రూ. 1.99 కోట్లు లాభాలు వచ్చాయి. ఇక, ఇంకో లక్ష వస్తే డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X