2018 Telugu Collections: 150 కోట్ల సినిమా.. తెలుగులో సెన్సేషన్.. ఫస్ట్ డేనే భారీ వసూళ్లు

ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల నుంచి బెస్ట్ కంటెంట్‌తో రూపొందిన చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా మలయాళంలో ఎన్నో ప్రయోగాత్మక, సహజసిద్ధమైన స్టోరీలతో సినిమాలు తెరకెక్కుతోన్నాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో దర్శక నిర్మాతలు మరిన్ని ఎక్స్‌పిరమెంట్స్ చేస్తున్నారు. ఇలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే '2018'. కేరళ వరదల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా అక్కడ సంచలన వసూళ్లను సాధించింది. దీంతో ఇప్పుడు తెలుగులో దీన్ని రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఫస్ట్ రిపోర్టును చూద్దామా!

2018 అంటూ తీసుకొచ్చారు : మాలీవుడ్ టాలెంటెడ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు ఇందులో కీలక పాత్రలను పోషించారు.

 harishshankar

కేరళలో సంచలన వసూళ్లు : మే 5వ తేదీన మలయాళంలో విడుదలైన '2018' చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్ డేన పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత విశేషంగా పుంజుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా అక్కడ రూ. 150 కోట్లు రాబట్టి.. మలయాళంలో టాప్ మూవీగా నిలిచింది.

 2018movie

తెలుగులో గీతా ఆర్ట్ రిలీజ్ : మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

 2018movie

అలాంటి టాక్.. లెక్క అలా : టివినో థామస్ నటించిన '2018' మూవీ విడుదలకు ముందే తెలుగులోనూ ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీనికితోడు ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా దీనికి లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగుంటాయని అన్నారు.

 2018movie

ఫస్ట్ డే ఎంత వచ్చిందంటే : మంచి కంటెంట్‌తో వచ్చిన '2018' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ లభించింది. దీంతో నైజాంలో రూ. 52 లక్షలు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 50 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా మొదటి రోజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.02 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 46 లక్షలు షేర్‌ను వసూలు చేసుకుంది.

 2018movie

ఇంకెంత వస్తే హిట్ అంటే : దేశం మొత్తం హైలైట్ అయిన '2018' సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో రూ. 1.80 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ చిత్రం మొదటి రోజు రూ. 46 లక్షలు షేర్ వసూలు చేసింది. అంటే.. ఇంకా ఇది రూ. 1.54 కోట్లు వసూలు చేస్తేనే క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. ఈ వీకెండ్‌లో రాణిస్తే ఇది ఈజీ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X