2018 Closing Collections: 2018 మూవీ సంచలనం.. 15 కోట్లతో తీస్తే 200 కోట్లు.. అల్లు నిర్మాత జాక్‌పాట్
మిగిలిన భాషలతో పోల్చుకుంటే మలయాళంలో సహజసిద్ధమైన కథలతో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటిది కేరళ రాష్ట్రం ఎదుర్కొన్న పెద్ద విపత్తు గురించి సినిమా తీస్తే.. రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందన్న దానికి '2018' మూవీనే ఉదాహరణ. మలయాళ ప్రజల ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ తీసిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దీన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. ఇక్కడ కూడా ఇది సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో '2018' మూవీ మలయాళంలో, తెలుగులో మొత్తంగా ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
కేరళ వరదల స్టోరీతో 2018:టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే '2018'. జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు నటించారు. ఇది కేరళ వరదల నేపథ్యంతో రూపొందింది.

కేరళలో టాప్ గ్రాస్ మూవీ:కేరళను అతాలకుతలం చేసిన వరదల స్టోరీతో '2018' మూవీని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు కేవలం రూ. 1.85 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టినా.. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా అక్కడ రూ. 200.60 కోట్లు వరకూ రాబట్టింది. తద్వారా మలయాళంలో టాప్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది.
అన్ని కోట్లకు తెలుగులోకి:నేచురల్ స్టోరీతో తెరకెక్కి మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన '2018' సినిమా యూనివర్శల్ కాన్సెప్టుతో రావడంతో దీన్ని వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే జీఏ2 పిక్చర్స్ ద్వారా దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. దీంతో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఇక్కడా సేమ్.. ఫుల్‌గానే:ఎమోషనల్ కాన్సెప్టుతో రూపొందిన '2018' మూవీని చూసిన అల్లు కాంపౌండ్ నిర్మాత బన్నీ వాసు దీన్ని మన భాషలోకి డబ్బింగ్ చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ మూవీ తెలుగులోనూ పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఆరంభం నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీ మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకుంది.
తెలుగులో ఎంతొచ్చింది?:'2018' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో టాక్‌కు తగ్గట్లుగానే అదిరిపోయే ఆదరణ వచ్చింది. దీంతో ఫుల్ రన్‌లో ఈ మూవీ నైజాంలో రూ. 5.30 కోట్లు గ్రాస్, సీడెడ్ ప్లస్ ఆంధ్రా మొత్తంలో రూ. 5.72 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా మొత్తంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 11.02 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.42 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుంది.

తెలుగులో లాభం ఎంత?:ఆంధ్రా, తెలంగాణలో '2018' చిత్రానికి రూ. 1.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 5.42 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకోవడంతో పాటు రూ. 3.42 కోట్లు లాభాలు వచ్చాయి. దీంతో బన్నీ వాసు మరో జాక్‌పాట్‌ను కొట్టేశారని చెప్పుకోవచ్చు.

ఓటీటీ వల్ల ప్రభావమే:మలయాళంలో విడుదలైన చాలా రోజుల తర్వాత '2018' సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేశారు. కానీ, అప్పటికే ఈ చిత్ర నిర్మాతలు సోనీ లివ్ సంస్థతో డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా తెలుగులో విడుదలైన 13 రోజులకే ఇది స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీనివల్ల కలెక్షన్లపై ప్రభావం పడింది. ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో రన్ ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











