twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2019లో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన బాలీవుడ్.. రికార్డు కలెక్షన్లు, ఫట్ అనుకొంటే హిట్

    |

    2019 సంవత్సరానికి బాలీవుడ్ ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమకు మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఈ సంవత్సరంలో కొన్ని చిత్రాలు ఊహించని విజయాలు, మరికొన్ని అంచనాలకు మించి బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకొన్నాయి. 2019లో బాక్పాఫీస్‌పై కాసుల వర్షం కురిపించిన చిత్రాలు ఇవే..

    హృతిక్, టైగర్ ష్రాఫ్ వార్

    హృతిక్, టైగర్ ష్రాఫ్ వార్

    2019లో బాలీవుడ్‌కు అత్యధిక వసూళ్లు అందించిన చిత్రం వార్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కాసుల పంటను పండించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.474.79 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఇంకా వాణీ కపూర్, అశుతోష్ రానా; అనుప్రియా గోయంకా తదితరులు నటించారు.

     ప్రభాస్ స్టామినాకు నిదర్శనం సాహో

    ప్రభాస్ స్టామినాకు నిదర్శనం సాహో

    ఇక విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచిన సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఉత్తరాదిన ఊహకు అందని క్రేజ్ ఏర్పడింది. సినిమాకు పెద్ద టాక్ లేకపోయినా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.439 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

    హిందీ అర్జున్ రెడ్డి సంచలన విజయం

    హిందీ అర్జున్ రెడ్డి సంచలన విజయం

    బాలీవుడ్‌లో 2019లో సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఒకటి. షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంపై విమర్శకులు పెదవి విరిచినా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ఘనతను సాధించింది. ఈ చిత్రం రూ.379.02 కోట్లు వసూలు చేసింది.

    బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రైక్ యూరీ

    బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రైక్ యూరీ

    ఇక చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని అందుకొన్న వాటిలో యూరి: ది సర్జికల్ స్ట్రైక్స్ ఒకటి. ఆదిత్యా ధార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యువ హీరో వికీ కౌశల్ నటించి అదరగొట్టాడు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఆయనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం వికీ కౌశల్‌కు నంది అవార్డు అందించింది. అంతేకాకుండా రూ.359.73 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

     నిర్మాతకు కాసులు.. ప్రేక్షకులకు నవ్వులు

    నిర్మాతకు కాసులు.. ప్రేక్షకులకు నవ్వులు

    బాలీవుడ్‌లో ప్రతికూల రివ్యూలను ఎదురించి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన చిత్రాల్లో హౌస్‌ఫుల్ 4 ముందుంటుంది. ఫహద్ సమ్జీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, కృతిసనన్, కృతి ఖర్పందా, పూజా హెగ్డేలు నటించారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.296 కోట్ల వసూళ్లను సాధించింది.

    అంతరిక్షానికి బాక్సాఫీస్

    అంతరిక్షానికి బాక్సాఫీస్

    బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూట్ మార్చి విభిన్నపాత్రలో కనిపించిన మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు సంబంధించిన కథా నేపథ్యంతో ఇచ్చిన ఈ చిత్రంలో విద్యాబాలన్, తాప్సీ పొన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హారి, నిత్యా మీనన్ నటించారు. ఈ చిత్రం రూ.290 కోట్లు వసూలు చేసింది.

    గల్లీలో కాసులు కురిపించిన బాయ్

    గల్లీలో కాసులు కురిపించిన బాయ్

    బాలీవుడ్‌లో భారీ అంచనాలతో వచ్చిన గల్లీబాయ్ ప్రేక్షకులను, హీరో రణ్‌వీర్ కపూర్‌ను ఏమాత్రం నిరాశపరచలేదు. ఆలియాభట్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు తోడు కావడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. జోయా అఖ్తర్ దర్శకత్వ ప్రతిభ కూడా విజయానికి దోహద పడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.238 కోట్లు వసూలు చేసింది.

    టోటల్ ఢమాల్ అనుకొంటే కనక వర్షం

    టోటల్ ఢమాల్ అనుకొంటే కనక వర్షం

    బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించిన మరో బాలీవుడ్ కామెడీ చిత్రం టోటల్ ఢమాల్. అజయ్ దేవగన్, అనిల్ కపూర్, రితేష్ దేశ్‌ముఖ్, మాధురి దీక్షిత్, ఆర్షద్ వార్సీ, జావెద్ జాఫ్రీ లాంటి సీనియర్ నటులు నటించిన ఈ చిత్రం థియేటర్‌లో నవ్వుల పూలుతోపాటు నిర్మాతకు కనకవర్షం కురిపించించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.232 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

    అంచనాలు లేకుండా భారీ విజయం చిచ్చోర్

    అంచనాలు లేకుండా భారీ విజయం చిచ్చోర్

    ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ హిట్ కొట్టిన బాలీవుడ్ చిత్రం చిచ్చొర్. ఐఐటీ బాంబే బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ శర్మ, నవీన్ పొలిశెట్టి, శ్రద్దాకపూర్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో కనిపంచారు. ఈ చిత్రం రూ.212 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

    English summary
    Hrithik Roshan' War, Prabhas's Saaho, Shahid Kapoor's Kabir Singh top collections in bollywood in 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X