twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2021లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 మూవీస్.. టాప్ వన్ లో నిలిచినా సినిమా ఏంటో తెలుసా?

    |

    ట్రైలర్ ని బట్టి ఆ మూవీ ఎలా ఉంటుందో అని సినీ ప్రేక్షకులు ఒక అంచనా కి వస్తారు. ఒకరకంగా సినిమా ట్రైలర్ అనేది సినిమాకు కారపాత్రమ లాంటిది. తమ అభిమాన హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మొత్తం మీద 2021లో టాప్ 5 ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం పదండీ.

    వకీల్ సాబ్ - 47.67 మిలియన్ వ్యూస్

    వకీల్ సాబ్ - 47.67 మిలియన్ వ్యూస్

    పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా వకీల్‌ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో కరోనా కారణంగా ఎక్కువ రోజులు ఆడ లేదు.రెండు వారాల పాటు సినిమా నడిచినా ఆ తర్వాత సెకండ్‌ వేవ్ కారణంగా థియేటర్లు మూసి వేయాల్సిన పరిస్థితి. దీంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అమెజాన్‌ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అయిన వకీల్‌ సాబ్‌ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ ఏడాది మొత్తానికి టాప్ లో నిలిచింది. ఈ ఆర్టికల్ రాసేనాటికి మొత్తం 47.67 మిలియన్ వ్యూస్ సాధించింది.

    ఆర్ ఆర్ ఆర్ - 35 మిలియన్ వ్యూస్

    ఆర్ ఆర్ ఆర్ - 35 మిలియన్ వ్యూస్

    రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం యావత్‌ ప్రపంచ సినీ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని భాషలతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో నటిస్తుండడం, జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ ఒక్కసారిగా అంచనాలను ఆకాశాన్ని పెంచేశాయి. అలా ఈ సినిమా ట్రైలర్ ఈ ఏడాది మొత్తానికి టాప్ 2గా నిలిచింది. ఈ ఆర్టికల్ రాసేనాటికి మొత్తం 35 మిలియన్ వ్యూస్ సాధించింది.

    అఖండ - 31.45 మిలియన్ వ్యూస్

    అఖండ - 31.45 మిలియన్ వ్యూస్

    నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజైన యాక్షన్ ఫిల్మ్ అఖండ. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించగా తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలయ్య డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ఈ ఏడాది మొత్తానికి టాప్ 3గా నిలిచింది. ఈ ఆర్టికల్ రాసేనాటికి మొత్తం 31.45 మిలియన్ వ్యూస్ సాధించింది.

    పుష్ప - 31.40 మిలియన్ వ్యూస్

    పుష్ప - 31.40 మిలియన్ వ్యూస్

    సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేషాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ఈ ఏడాది మొత్తానికి టాప్ 4గా నిలిచింది. ఈ ఆర్టికల్ రాసేనాటికి మొత్తం 31.40 మిలియన్ వ్యూస్ సాధించింది.

    ఉప్పెన - 29.81 మిలియన్ వ్యూస్

    ఉప్పెన - 29.81 మిలియన్ వ్యూస్

    సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఉప్పెన‌. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల అయింది. ఈ సినిమాలో మంగ‌ళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా సినిమా మొత్తం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఉప్పెన ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ఈ ఏడాది మొత్తానికి టాప్ 5గా నిలిచింది. ఈ ఆర్టికల్ రాసేనాటికి మొత్తం 29.81 మిలియన్ వ్యూస్ సాధించింది.

    English summary
    2021 Most Viewed Telugu Movie Trailers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X