Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఒక బాక్సాఫీస్ సందడి సినీ నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సీజన్ లో కలెక్షన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ రావడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా వస్తే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆడియేన్స్ నుంచి సపోర్ట్ వస్తుందని మరోసారి ఋజువయ్యింది. ముఖ్యంగా క్రాక్ హిట్టుతో మంచి బూస్ట్ లభించింది. ఇక జనవరి 26 తరువాత కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన సినిమాల కలెక్షన్స్ కు ఇదే ఆఖరి రోజు కావచ్చు. ఇక సినిమాల టోటల్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

Recommended Video

Krack సక్సెస్ జోష్ లో Ravi Teja | Khiladi First Glimpse On Republic Day | Filmibeat Telugu

పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

క్రాక్.. లాభం ఎంతంటే..

క్రాక్.. లాభం ఎంతంటే..

ముందుగా చెప్పుకోవాల్సింది మాస్ రాజా క్రాక్ సినిమా గురించే. అసలు సినిమా విడుదల అవ్వడమే కష్టమే అనుకుంటున్న తరుణంలో అదిరిపోయే కలెక్షన్స్ అందించి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు రవితేజ. ఆ సినిమా ఇప్పటికే 30కోట్లకు పైగా షేర్స్ అందుకొని గ్రాస్ పరంగా ఆఫ్ సెంచరీ బాదేసింది. ఇది రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. పెట్టిన పెట్టుబడికి 15కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.

ప్రాఫిట్ జోన్ లో రెడ్..

ప్రాఫిట్ జోన్ లో రెడ్..

మరోవైపు రెడ్ సినిమా కూడా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5కోట్లు మాత్రమే. ఇక 12 రోజుల్లో దాదాపు 20కోట్లకు పైగా షేర్స్ అందుకొని రామ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. మొత్తానికి సినిమా 5కోట్లకు పైగా ప్రాఫిట్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

విజయ్ బెస్ట్ రికార్డ్

విజయ్ బెస్ట్ రికార్డ్

ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 220కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాడు. అయితే తెలుగులో ఆయనకు ఈ సారి సాలీడ్ ఓపెనింగ్స్ దక్కాయి. జనవరి 13న వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. ఇక 13రోజుల్లో 15కోట్ల వరకు షేర్స్ అందుకుంది. మొత్తంగా 6కోట్లతో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు టాక్.

మరో రెండున్నర కోట్లు రావాలి

మరో రెండున్నర కోట్లు రావాలి

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా మాత్రం ఇంకా ప్రాఫిట్ జోన్ లోకి రాలేదు. సినిమా పెద్దగా పాజిటివ్ టాక్ ను అయితే అందుకోలేకపోయింది. ఈ సినిమా 9.8కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో జనవరి 14న రిలీజ్ అవ్వగా 12రోజుల్లో 8కోట్ల వరకు షేర్స్ అందుకుంది. ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే మరో రెండున్నర కోట్లు రావాలి.

అల్లరి నరేష్.. ఇంకా ఎంత తేవాలి?

అల్లరి నరేష్.. ఇంకా ఎంత తేవాలి?

అల్లరి నరేష్ బంగారు బుల్లోడు పరిస్థితి కూడా దాదాపు అదే తరహాలో ఉంది. ఈ సినిమా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5కోట్లు మాత్రమే. ఇక సినిమా ఇప్పటివరకు మూడు రోజుల్లో 2కోట్ల షేర్స్ కూడా అందుకోలేదని టాక్. సినిమా మరో 2కోట్ల వసూళ్లను అందుకుంటేనే ప్రాఫిట్ లోకి వస్తుంది. మరి ఈ రోజు ఎంతవరకు లాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X