2021లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 మూవీ.. అత్యధిక లాభాలు అందించిన సినిమా అదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఇంకా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సింది. కరోనా హడావిడి లేకపోయి ఉంటే తప్పకుండా మన టాలీవుడ్ స్థాయి మరొక లెవెల్లో ఉండేదని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా కష్ట కాలంలో కూడా మన సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాభాలు బాగానే అందుకున్నాయి. ఓ వైపు కరోనా మరోవైపు ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు నడుమ సినిమాలు గ్రాస్ కలెక్షన్స్ బాగానే అందుకున్నాయి. ఇక ఈ ఏడది బాక్సాఫీస్ వద్ద అత్యదిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 సినిమాల లిస్టులోకి వెళితే..

Recommended Video

2021 Year Ender : Tollywood Top Gross Collected Movies In 2021
పవర్ స్టార్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్

పవర్ స్టార్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్

వకీల్ సాబ్:రెండు సంవత్సరాల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వకీల్ సాబ్‌ మొత్తానికి భారీ ఒపెనింగ్స్ అందుకుంది. శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ మరియు అనన్య నాగళ్ల నటించిన ఈ సినిమా హిందీ చిత్రం పింక్‌కి రీమేక్ వచ్చింది. వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 137. 65 కోట్లు అందుకుంది. ఇక ఇప్పటివరకు 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

అఖండ పవర్ఫుల్ హిట్

అఖండ పవర్ఫుల్ హిట్

అఖండ:బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్స్ గా నటించగా జగపతి బాబు మరియు శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కేవలం ఐదు రోజుల్లో 80 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు వారాల్లో వంద కోట్ల గ్రాస్ ను దాటేసింది. ఇక ప్రస్తుతం వసూళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి.

బెస్ట్ హీరోగా ఎంట్రీ

బెస్ట్ హీరోగా ఎంట్రీ

ఉప్పెన:వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బెస్ట్ జీరోగా అరంగేట్రం చేసాడు. హీరోయిన్ గా కృతి శెట్టితో పాటు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో మంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ బ్లాక్‌బస్టర్ డ్రామాలో విజయ్ సేతుపతి కూడా భాగమయ్యాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 90కోట్ల వసూళ్లను అందుకుంది.

అత్యధిక లాభాలు..

అత్యధిక లాభాలు..

జాతి రత్నాలు: మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాలో వచ్చిన జాతిరత్నాలు సినిమాకుఅనుదీప్ కెవి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ ఏడాదిలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలను అందించిన సినిమాల్లో టాప్ 5లో నిలిచింది.

క్రాక్ సాలీడ్ హిట్

క్రాక్ సాలీడ్ హిట్

క్రాక్ సినిమాతోమాస్ మహారాజా రవితేజ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన క్రాక్ రూ. 67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. రవితేజ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో వసూళ్లను సాధించి పెట్టింది. అయితే కరోనా వైరస్ కేసుల పెరుగుదల కారణంగా కలెక్షన్లు చాలానే తగ్గాయి. అయినప్పటికీ 50% ఆక్యుపెన్సీ లో సినిమా ఈ స్థాయిలో వసూళ్లను అందుకుంది అంటే గ్రేట్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X