రామ్ చరణ్ 1000కోట్లు.. పవర్ స్టార్ 100కోట్లు.. ఆ రికార్డుల కోసం బాబాయ్, అబ్బాయ్ రెడీ!
బాక్సాఫీస్ వద్ద రానున్న రోజుల్లో పెద్ద సినిమాలలు సంచలన విజయాలను అందుకోబోతున్నాయని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక అన్ని సినిమాలు కూడా ఎక్కువగా ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా పెద్ద సినిమాలను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందులో సంక్రాంతికి వచ్చే సినిమాలపై అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పొంగల్ భరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడి ఉన్నారు. ఇక వీరి టార్గెట్ అయితే ఇప్పటికే సెట్ అయ్యింది. తప్పకుండా ఆ టార్గెట్ ను ఈజీ గా అందుకుంటారని తెలుస్తోంది.

బెస్ట్ సీజన్
సంక్రాంతి అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంటుంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు తేడా లేకుండా అన్ని ఒకేసారి అన్ని సినిమాకు ఎంతో నమ్మకంతో రిలీజ్ అవుతాయి. పోటీ ఎంత ఉన్నప్పటికీ కూడా కంటెంట్ ఉన్న సినిమాలకు సంక్రాంతి బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. ప్రేక్షకులు ముందుగా ఎలాంటి సినిమాకు వెళ్లాలి అనే ఆలోచనతోనే థియేటర్లోకి అడుగు పెడతారు. అందుకే చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతూ ఉంటాయి.

మార్కెట్ కు తగ్గట్టుగానే..
ఇక 2022 సంక్రాంతికి ముందుగా త్రిబుల్ ఆర్ సినిమా జనవరి 7వ తేదీన రాబోతోంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ జనవరి 12న రానుంది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇక ఈ పోటీలో ఎవరు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రతి సినిమాపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. స్టార్ హీరోలు వారి మార్కెట్ కు తగ్గట్టుగానే భారీగా సినిమాలను విడుదల చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి తప్పకుండా ఒక ప్రత్యేకమైన సందడి నెలకొంటుందని చెప్పవచ్చు.

మెగా బాక్సాఫీస్ ఫైట్
జనవరి 7వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ సినిమాలో కలిసి నటించారు. అయితే జనవరి 12 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి వస్తుండడంతో ఈ రెండు సినిమాలకు గాను మెగా బాక్సాఫీస్ ఫైట్ అన్నట్లుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఒక విధంగా అభిమానులు ఈ పోటీని ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా అందరిలోనూ ఆలోచనలను కలిగిస్తోంది.
Recommended Video

బాబాయ్ 100కోట్లు.. అబ్బాయ్ 1000కోట్లు
నిజానికి సంక్రాంతి అనగానే ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ ఫైనల్ గా కంటెంట్ ఎలా ఉంది అనే విషయంపైనే సినిమా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక రామ్ చరణ్ ఈ సంక్రాంతికి ఈజీగా వెయ్యి కోట్ల మార్కెట్ ను అందుకున్న సినిమాతో వార్తల్లో నిలుస్తాడు అని చెప్పవచ్చు. ఇక మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి వంద కోట్ల షేర్ అందుకుంటాడాని కూడా తెలుస్తోంది. ఇక బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా రికార్డులను అందుకుంటే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. మరి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియాలి అంటే సినిమాలు వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











