సమ్మర్ బాక్సాఫీస్ ఫైట్: ఒకేసారి రాబోతున్న అగ్ర హీరోలు.. రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది సంక్రాంతికి తప్పితే మళ్ళీ ఆ తరువాత పెద్ద సినిమాల మధ్య పోటీ జరగలేదు. అయితే రానున్న రోజుల్లో మాత్రం మన అగ్ర హీరోల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల గ్యాప్ లోనే పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఇక ఆ ఫైట్ లో మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తలపడబోతున్నారు. ఇక ఆ పోటీలో పవన్ కళ్యాణ్ కూడా నిలవనున్నట్లు తెలుస్తోంది.
హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోన్న బుల్లితెర నటి నియా శర్మ

గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు
ఈ జనరేషన్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిగెస్ట్ స్టార్స్ పోటీకి దిగితే వాతావరణం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఫైట్ కంటే ముందు సినిమాల నిర్మాతల మధ్య చర్చలు జరగకుండా అయితే ఉండవు. సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం అయితే పడుతుంది. అందుకే వీలైనంత వరకు గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు.

2022 ఫస్ట్ ఫైట్
మహేష్ బాబు సర్కారు వారి పాటపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అందరికంటే ముందే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక పిరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు. 17వ శతాబ్దంలోని కొన్ని హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సమ్మర్ ఫైట్ లో..
సంక్రాంతికి ఫైట్ అనంతరం 2022 సమ్మర్ లో కూడా స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ మరింత తీవ్రంగా ఉండవచ్చని సమాచారం. ముందుగా త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుండగా ఆ తరువాత ప్రభాస్ సలార్ రానుంది. సలార్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అదే నిజమైతే..
ఏప్రిల్ లో వారం గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎన్టీఆర్ సినిమా ముందే రావచ్చని టాక్ వస్తుండగా పవన్ కళ్యాణ్ కూడా మరో సినిమాతో రావచ్చని సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో డిఫరెంట్ సినిమా కూడా ఏప్రిల్ లో ఎప్పుడైనా రావచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. అదే నిజమైతే ఒక్క ఏప్రిల్ నెలలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం కాయం.


Click it and Unblock the Notifications











