2023 ఫస్ట్ హాఫ్ బాక్సాఫీస్.. నిర్మాతలను దారుణంగా దెబ్బ కొట్టిన సినిమాలు ఇవే!
ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. ఎంతో కొంత రాబట్టాల్సిన స్టార్స్ కూడా ఊహించని డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నారు. కంటెంట్ వర్కౌట్ కాకపోతే ఈ మద్య స్టార్ హోదా సినిమాకు ఏమాత్రం హెల్ప్ కావడం లేదు. ఇక 2023 టాలీవుడ్ కు ఒక పెద్ద గుణపాఠం అని చెప్పవచ్చు.
ఇక వేసవిలో సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ కి ఎక్కువ వస్తారని ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ ఏడాది పెద్ద సినిమాలనే రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాల ఫలితం నిర్మాతలని దారుణమైన నష్టాలు మిగిల్చాయి. ఇక ఇప్పటివరకు ఈ ఏడాదిలో అత్యదిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమాల వివరాల లోకి వెళితే..

శాకుంతలం దెబ్బ: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ వేసవి సీజన్ లో టాలీవుడ్ ని పలకరించాయి. భారీ అంచనాల నడుమ వచ్చి రెండు రోజుల్లోనే ప్రేక్షకుల తిరస్కరణకి గురయ్యాయి. ఎవరేజ్ టాక్ వచ్చిన సినిమాలకి సైతం కోట్లతో నష్టం వచ్చింది.
వీటి లైన్ అప్ చూసుకుంటే ముందుగా శాకుంతలం సినిమా కనిపిస్తోంది. ఈ చిత్రం గుణశేఖర్, దిల్ రాజులకి ఏకంగా 50 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. గుణశేఖర్ చాలా నమ్మకంతో చేసిన ప్రేక్షకులు మాత్రం నచ్చలేదని స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

అక్కినేని హీరోల డిజాస్టర్స్: ఇక అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన్ ఏజెంట్ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఏకంగా 33 కోట్లకి పైనే నష్టం వచ్చింది. నాగ చైతన్య కస్టడీ సినిమా కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ 18 కోట్ల నష్టం మిగిల్చింది. ఈ విధంగా అక్కినేని బ్రదర్స్ కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు.

రామబాణం నష్టాలు: గోపీచంద్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా రామబాణం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అతని ఖాతాలో మరో డిజాస్టర్ గా మారింది. ఈ చిత్రంతో ఏకంగా 16 కోట్ల నష్టం నిర్మాతకి వచ్చింది. బెస్ట్ కాంబినేషన్ గా శ్రీవాస్, గోపిచంద్ ఇంతకుముందు సక్సెస్ లు అందుకోగా రామబాణం మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది.

రవితేజ రావణాసుర: ఇక రవితేజ, సుదీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రావణాసుర. ఈ చిత్రం ఊహించని టాక్ అయితే తెచ్చుకుంది. రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం, స్క్రీన్ ప్లే లో లోపాల కారణంగా మూవీ థియేటర్స్ లో కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి 11 కోట్ల నష్టం వచ్చింది. వీటిలో రామబాణం, ఏజెంట్ సినిమాలకి నాన్ థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా పెద్దగా రాలేదు. మొత్తానికి ఈ సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్ నిర్మాతలని దారుణంగా దెబ్బ తెసిందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











