2023 Sankranti Movies: నెవ్వర్ బిఫోర్ అనేలా టాలీవుడ్ హీరోల బాక్సాఫీస్ ఫైట్.. మధ్యలో తమిళ హీరో!

పండగ సమయం అనేది సినిమాలకు చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ కు అయితే సంక్రాంతి ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన అవకాశం గా మారుతుంది. ఈ ఫెస్టివల్లో కాస్త పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తూ ఉంటాయి. అందుకే ప్రతిసారి కూడా పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇక 2023 సంక్రాంతికి కూడా ముగ్గురు తెలుగు అగ్ర హీరోలు సినిమాలు రాబోతున్నాయి. అలాగే మధ్యలో మరొక తమిళ హీరో కూడా తన ద్విభాష చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట ప్రభాస్

మొదట ప్రభాస్

అందరికంటే ముందుగానే రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ రామాయణం కథ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. 3D యానిమేషన్ టెక్నాలజీతో ఈ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు పెద్దగా రెస్పాన్స్ అయితే లేకపోయినప్పటికీ తప్పకుండా సినిమా వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతిలో అందరికంటే ముందుగా రాబోతోంది.

మెగాస్టార్ మూవీ

మెగాస్టార్ మూవీ

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక బాబీ దర్శకత్వం వహిస్తూ ఉన్న ఈ సినిమా కూడా తప్పకుండా సంక్రాంతి బరిలో నిలవవచ్చు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది.

బాలయ్య కూడా

బాలయ్య కూడా

అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మరొక సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక 2024 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

 మధ్యలో వారసుడు

మధ్యలో వారసుడు

అలాగే ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ లో మరొక తమిళ హీరో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళంలో వందల కోట్ల మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ ఎప్పటినుంచో తెలుగులో కూడా సక్సెస్ కావాలి అని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా అతని రేంజ్ పెరిగే విధంగా ఒకేసారి ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న వారసుడు సినిమా సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

 ఒకరు తప్పుకునే అవకాశం

ఒకరు తప్పుకునే అవకాశం

2024 సంక్రాంతికి ఒకేసారి నలుగురు పెద్ద హీరోలు వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంటుంది. ఏదో ఒక సినిమాపై కొంత ప్రభావం పడే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే ఈ పోటీ నుంచి ఎవరో ఒకరు తప్పుకునే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఎవరో ఒకరు సంక్రాంతి తర్వాత లేదా అంతకంటే ముందు రావచ్చు అని కూడా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఎక్కువగా అయితే బాలకృష్ణ సినిమా వాయిదా పడవచ్చు అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X