2025 Highest Grosser in India: 2025లో బాక్సాఫీస్‌ను రఫాడించిన మూవీస్.. కాంతార, ఛావా, ఓజీ. .ఇంకా ఏ చిత్రాలంటే?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ 2025 సంవత్సరాన్ని మిక్స్‌డ్ రిపోర్ట్‌తో ముగించుకొనేందుకు సిద్దమైంది. 2025 ఏడాదిలో ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చే హిట్స్, బ్లాక్ బస్టర్ల నమోదు కాగా, మరోవైపు ఫ్లాపులు కూడా వెంటాడాయి. కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయగా.. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు తమ సత్తాను చాటుకొన్నాయి. అయితే ఈ సంవత్సరంలో సాక్ నిక్ రూపొందించిన ఇండియా వైడ్‌గా భారీ విజయాలు అందుకొన్న టాప్ 10 సినిమాల జాబితాల విషయానికి వెళ్తే..

రైడ్ 2 చిత్రం
బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా హిట్ చిత్రాల జాబితాలో నిలిచాయి. రైడ్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 237 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 206 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్‌లో 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

2025 Highest Grosser in India

గుడ్ బ్యాడ్ అగ్లీ
అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వరల్డ్ వైడ్‌గా 248 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియా వైడ్ 180.75 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 67.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం
ఇండియా వైడ్ హిట్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 220 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 34.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 255.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సితారే జమీన్ పర్
ఈ ఏడాది హిట్ సాధించిన చిత్రాల్లో అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ చిత్రం కూడా చేరింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించి.. అమీర్ ఖాన్‌కు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం 200 కోట్ల రూపాయల గ్రాస్ ఇండియాలో వసూలు చేయగా.. ఓవర్సీస్‌లో 66.75 కోట్ల రూపాయలు రాబట్టింది. వరల్డ్ వైడ్ 267 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

హౌస్‌ఫుల్ 5 మూవీ
బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ 5 కూడా డివైడ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకొన్నది. ఇండియాలో ఈ చిత్రం 218 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 288.7 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఓజీ చిత్రం
ఇక పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగినట్టుగానే వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్‌లో 65.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 295 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

లోక: చాప్టర్ 1 చంద్ర
2025 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో మలయాళ సినిమాకు చోటు దక్కింది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా రూపొందిన లోక: చాప్టర్ 1 చంద్ర చిత్రం మాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇండియాలో 184 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా.. ఓవర్సీస్‌లో 120 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 304 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.

మహావతార్ నర్సింహా
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో చిత్రం మహావతార్ నర్సింహ. కన్నడ చిత్రంగా వివిధ భాషల్లోకి డబ్ అయిన ఈ సినిమా ఇండియా వైడ్ 299 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 28 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 327 కోట్ల రూపాయల కలెక్షన్లను వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

సయ్యారా కలెక్షన్ల వర్షం
చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందిన ప్రేమ కథా చిత్రం సయ్యారా చిత్రం బాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 399 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్‌లో 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ సినిమా రంగంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది.

రష్మిక మందన్న ఛావా
హిందీ సినిమా రంగంలో మరో రికార్డు వసూళ్లు సాధించిన చిత్రం వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఛావా. ఈ చిత్రం ఇండియాలో 716 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించగా.. ఓవర్సీస్‌లో 91 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 807 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇండియాలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

కంతారా: చాప్టర్ 1
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1 రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇండియాలో 741 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో 111 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 852 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఈ ఏడాది వసూళ్ల పరంగా టాప్ రేపింది.

వార్ 2, కూలీ చిత్రాలు
ఇక ఈ చిత్రాలు కాకుండా రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం వసూళ్ల పరంగా భారీగానే నమోదు చేసింది. కానీ బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా చూస్తే బాక్సాఫీస్‌ను అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం 518 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే వార్ 2 చిత్రం కూడా బిజినెస్ పరంగా భారీ నష్టాల్లో ముగిసింది. కానీ ఈ చిత్రం 364 కోట్ల రూపాయలు వసూలు చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X