For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  23 years of RGV Satya: మొదలైన 3రోజులకే బ్రేక్.. 2కోట్లతో తీసిన సినిమా, అప్పట్లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్!

  |

  అప్పటి వరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు సరికొత్త అర్దాన్ని చెప్పిన సినిమా సత్య. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ ప్రయోగానికి అప్పట్లో దేశమంతా ఎట్రాక్ట్ అయ్యింది. ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి మొదలైన కథను వర్మ ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరీంచారు. ఇక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి 23ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

   గ్యాంగ్ స్టర్స్ లైఫ్

  గ్యాంగ్ స్టర్స్ లైఫ్

  గ్యాంగ్ స్టర్స్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో అప్పటి వరకు సాదారణ జనాలకు పెద్దగా తెలియదు. అయితే 1998లో వచ్చిన సత్య సినిమాలో వర్మ చూపించిన విధానం కళ్ళముందే ఎదో జరుగుతుందన్న భావన కలిగించింది. ఆ సినిమాను చాలా వరకు కొత్త నటీనటులతోనే షూట్ చేశారు. జెడి చక్రవర్తి మెయిన్ హీరోగా కనిపించాడు.

  సత్య ద్వారా పరిచయమైన వారు

  సత్య ద్వారా పరిచయమైన వారు

  ఊర్మిలా మాటోండ్కర్ జెడి చక్రవర్తికి జోడిగా నటించగా మనోజ్

  బాజ్‌పేయితో పాటు మరికొందరు అగ్ర నటులు ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్లాతో సహా చాలా మంది కొత్తవారికి రామ్ గోపాల్ వర్మ అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారందరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు.

   మూడు రోజులకే బ్రేక్

  మూడు రోజులకే బ్రేక్

  అయితే సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. మళ్ళీ రెండు వారాల అనంతరం రామ్ గోపాల్ వర్మ చర్చలతో సినిమాను మొదలు పెట్టారు. అయితే ఆ సినిమా ఆగిపోయి ఉంటే నేను ఇప్పుడు ఇంత వరకు వచ్చి ఉండేవాడిని కాదేమో అని మనోజ్

  బాజ్‌పేయి బాజ్‌పేయి వివరణ ఇచ్చారు.

   పాటలు లేకుండా..

  పాటలు లేకుండా..

  ఇక సినిమాలో ఒక్క సాంగ్ కూడా ఉండకుండా షూటింగ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పట్లో అది ఎవరు ఊహించని ప్రయోగం. అప్పటి వరకు పాటలు లేకుండా సినిమాలు రాలేదు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ ను ఒత్తిడి రావడంతో వర్మ తనదైన శైలిలో విశాల్ భరద్వాజ్ తో పాటలను కంపోజ్ చేయించాడు. అసలు ఈ సినిమాను ఎవరు చూడరని చాలామంది కామెంట్స్ చేశారు. కానీ విడుదల తరువాత కామెంట్స్ చేసిన వారు నోరు మూత పడేలా సత్య సంచలన విజయాన్ని అందుకుంది.

  మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

  మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

  2కోట్ల బడ్జెట్ తో అతికష్టం మీద షూటింగ్ పూర్తి చేసిన రామ్ గోపాల్ వర్మ జూలై 3న సినిమాను విడుదల చేయించారు. ఇక మొత్తానికి సినిమా ఫస్ట్ వీకెండ్ అనంతరం హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 18కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు టాక్. 1998లో అత్యదిక వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా సత్య న్యూ రికార్డును క్రియేట్ చేసింది.

  English summary
  Satya film that has given a whole new meaning to the routine commercial action movies that have come up till then. The experiment by the iconic director Ram Gopal Varma attracted the attention of the entire country at that time. Verma portrayed the story from a real incident in a very interesting way. The film is 23 years old. If you take a look at the collections related to the movie on this occasion ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X