ఈ వీడియో చూశారా? ‘పేట’ 25వ రోజు, టోటల్ కలెక్షన్ ఎంత?
2019 సంవత్సరంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' రూపంలో తొలి అతిపెద్ద హిట్ నమోదు చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతూ 4వ వారంలోకి అడుగు పెట్టింది.
తాజాగా ఈచిత్రం 25వ రోజుకు చేరిన సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్ డబ్బింగ్ చెబుతున్న వీడియో ట్వీట్టర్లో షేర్ చేసి అభిమానలను సర్ ప్రైజ్ చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తలైవా హిట్ చిత్రాల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్ ‘పేట’
‘పేట' సినిమా 25వ రోజుకు చేరుకున్న సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు ఈ వీడియో షేర్ చేసినట్లు కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.

రూ. 200 కోట్లు
‘పేట' చిత్రం ఇప్పటికే రూ. 200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది. ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 250 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మార్క్ అందుకుంటుందా? లేదా? అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొని ఉంది. దర్శకుడు మళ్లీ వింటేజ్ రజనీకాంత్‌ను ఈ సినిమా ద్వారా చూపించడం అభిమానులను మెప్పించింది.

చెన్నైలో కేక
‘పేట' చిత్రం ఒక్క చెన్నైలోనే 18 రోజుల్లో రూ. 14.06 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. సినిమా విడుదలైన దాదాపు అన్ని చోట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు తెచ్చిపెట్టి రజనీ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

యూఎస్ఏలోనూ అదుర్స్
‘పేట' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా అదరగొట్టింది. 7,836,370 ($1.9M) గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘విశ్వాసం' కలెక్షన్లను చాలా చోట్ల ‘పేట' అధిగమించడం గమనార్హం. ఇందులో రజనీకి జోడీగా సిమ్రన్, త్రిష నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











