తెలుగు రాష్ట్రాల్లో 2.0 తొలిరోజు వసూళ్లు.. నైజాంలో అదిరేలా, ఇంకా ఎంత రాబట్టాలంటే!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో 10 వేల స్క్రీన్‌లలో 2.0 విడుదల కావడం విశేషం. అంచనాలకు తగ్గట్లుగానే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో తొలి వీకెండ్ వసూళ్లు కళ్ళు చెదిరేలా ఉంటాయని అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ క్రేజ్‌కు, శంకర్ విజన్ తోడు కావడం, ప్రతినాయకుడి పాత్రలో అక్షయ్ కుమార్ అబ్బురపరిచేలా ఉండడంతో 2.0 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ స్టార్ రజనీకి, శంకర్‌కు మార్కెట్ ఉంది. ఏపీ, నైజాంలో తొలిరోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే

ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే

రజనీకాంత్, శంకర్‌కు ఉన్న క్రేజ్‌తో 2.0 చిత్రానికి 70 కోట్ల వరకు ఏపీ తెలంగాణాలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 2.0 చిత్రానికి 357 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం థియేట్రికల్ హక్కుల రూపంలోనే ఈ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ హక్కులు కూడా కలుపుకుంటే 500 కోట్లకు దాటిపోయిందని అంచనా. భారత సినిమా చరిత్రలో మరే చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు.

నైజాంలో అదుర్స్ అనిపించేలా

నైజాంలో అదుర్స్ అనిపించేలా


ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఆశాజనకంగానే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో శంకర్ 2.0 చిత్రం అదరగొట్టింది. తొలిరోజు 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. వీకెండ్ లో వసూళ్లు మరింతగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ కలెక్షన్లని బట్టి ఈ చిత్ర విజయంపై ఓ అంచనాకు రావచ్చు.

ఆంధ్రలో ఎంతంటే

ఆంధ్రలో ఎంతంటే

ఆంధ్ర ఏరియాలో 2.0 చిత్రం 10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రల్లో ఈ చిత్రం 18 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో షేర్ విలువ 12 కోట్లు. 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి వీకెండ్‌లో ఈ చిత్రం బాగా పుంజుకోవాలి. 'ఏ'సెంటర్ ఆడియన్స్ నుంచి 2.0 చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడం విశేషం.

600 కోట్ల బడ్జెట్

600 కోట్ల బడ్జెట్


శంకర్ ఈ చిత్రాన్ని సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్, అక్షయ్ కుమార్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించింది. సెల్ ఫోన్‌ల వాడకం, రేడియేషన్ వలన పక్షులకు జరిగే అనర్థాలని ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. రజని, అక్షయ్ మధ్య జరిగే పోరాటాలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X