3 BHK Box Office: 3 BHK మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. సిద్దార్థ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న సిద్దార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా నటించిన చిత్రం 3 BHK. యువ నిర్మాత అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

3 BHK సినిమా కథ విషయానికి వస్తే.. వాసుదేవన్ (శరత్ కుమార్) (భార్యగా దేవయాని) దంపతులకు ప్రభు (సిద్దార్థ్) ఆరతీ (మీతా రఘనాథ్) సంతానం ఉంటుంది. మధ్య తరగతి కుటుంబానికి ఎప్పటికైనా సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనే కల ఉంటుంది. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రభుకు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వాసుదేవన్‌ను ఆందోళనకు గురి చేసింది. తండ్రి ఆలోచనలకు, ఆశయాలకు ప్రభు దూరంగా ఉంటే.. కూతురు జీవితం భారీ కుదుపుకు లోనవుతుంది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాగే ఎమోషనల్ స్టోరీలో సొంత ఇంటిని సాకారం చేసుకొన్నారా? లేదా అనేది మూవీ కథ.

3 BHK Movie Day 1 Expected Box Office

యువ నిర్మాత అరుణ్ విశ్వ రూపొందించిన ఈ సినిమాలో భావోద్వేగాలతోపాటు, ఎమోషన్స్‌ భారీగా జొప్పించారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను శాంతి టాకీస్ బ్యానర్‌పై సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ తెలుగులో భారీగా రిలీజ్ చేసింది. ఈ సినిమాను సుమారుగా 250 స్క్రీన్లలో తెలుగు రాస్ట్రాల్లో విడుదల చేసింది. ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.

తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాకు తమిళంలో సూపర్ ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. చెన్నై, బెంగళూరు, మదురై, కోయంబత్తూరు, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో ఆదరణ లభించింది. తెలుగులో కూడా 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో భారీగా ఆక్యుపెన్సీ కనిపించింది.

ఈ సినిమాకు తమిళనాడులో సుమారుగా 2.5 కోట్ల రూపాయలు, తెలంగాణ, ఏపీలో ఈ మూవీకి 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో 50 లక్షలు, కేరళలో 25 లక్షలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఈ సినిమా మొత్తంగా తొలి రోజు 5.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.

సిద్దార్థ్, శరత్ కుమార్ నటించిన ఈ సినిమా 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నందున్న రానున్న రోజుల్లో సులభంగా టార్గెట్ చేరుకొంటుందని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Read more about: 3 BHK siddharth box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X