3BHK Box Office Day 12 : 40 కోట్ల బడ్జెట్‌తో 3 BHK సినిమా.. సిద్ధార్థకు ఊహించని నష్టం.. ఎన్ని కోట్లంటే?
సౌత్ స్టార్ తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన గత చిత్రం చిన్నా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక అదే ఊపులో రీసెంట్ గా 3 BHK అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూలై 4న తెలుగు, తమిళంలో విడుదలైంది. హీరోయిన్ గా కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ నటించింది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 12వ రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..
3 BHK సినిమా బడ్జెట్?
తమిళ హీరో సిద్ధార్థ నటించి 3 BHK చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. సిద్ధార్థకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు అనుగుణం బడ్జెట్ వెచ్చించారు. చిత్రంలోని లోకేషన్లు, స్టార్ కాస్ట్, నిర్మాణ విలువలను పెంచేందుకు వీలైనంత మేరకు ఖర్చు చేశారు. ఇక 3 BHK చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ నిర్మించారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలు కలుపుకొని రూ.40 కోట్లు అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

3 BHK బ్రేక్ ఈవెన్ టార్గెట్?
3 BHK సినిమాను తెలుగులో మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. రెండు తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఏపీలో కలిపి సుమారుగా 250 స్క్రీన్లలో విడుదల చేయడం విశేషం. అప్పటికే తమిళంలో భారీగా విడుదలైంది. ఇక సిద్ధార్థకు ఉన్న స్టార్ ఇమేజ్ తోనే ఈ సినిమాకు వసూళ్లు రావాల్సి ఉంది. ఈ క్రమంలో 3 BHK లాభాల్లోకి రావాలంటే 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.
3 BHK 12వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్..
తొలి రోజు 3 BHK చిత్రానికి ఇటు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి, అటు బాక్సాఫీస్ నుంచి కూడా మంచి వసూళ్లు దక్కాయి. ఓపెనింగ్ డే రూ.1.35 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.2.25 కోట్లు, 3వ రోజు రూ.3.88 లక్షలు, 4వ రోజు రూ.72 లక్షలు, 5వ రోజు రూ.1.05 కోట్లు, 6వ రోజు రూ.65 లక్షలు, 7వ రోజు రూ.65 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇలా వారం రోజుల్లో ఇండియా గ్రాస్ రూ.9 కోట్లు, ఇండియా నెట్ రూ.7.68 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.75 కోట్లు, ఇక వరల్డ్ వైడ్ ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని రూ.10.75 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 8వ రోజు రూ.38 లక్షలు, 9వ రోజు రూ.23 లక్షలు, 10వ రూ.93 లక్షలు, 11వ రోజు రూ.24 లక్షలు, 12వ రోజు రూ.26 లక్షల నెట్ వసూల్ చేసింది. 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.13.72 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.10.33, 11.97 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.1.75 కోట్లు వసూల్ చేసింది.
ఎన్ని కోట్ల నష్టం?
సిదార్థ నటించిన లేటెస్ట్ చిత్రం 3 BHK. ఈ చిత్రాన్ని 40 కోట్ల వరకు గ్రాస్ రావాల్సి ఉంది. కానీ 14 కోట్ల రూపాయల వరకే వసూళ్లు అందాయి. దీంతో ఇంకా థియేట్రికల్ రన్ ద్వారా రూ.26 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఒక వేల నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా బిజినెస్ వచ్చినా కూడా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు నష్టం వాటిల్లిందనేది సాక్ నిల్క్ రిపోర్ట్ ద్వారా అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











