3 BHK day 2 Box Office: 3 BHK మూవీకి టాక్ సూపర్.. సిద్దార్థ్ సినిమాకు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న సిద్దార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా నటించిన చిత్రం 3 BHK. యువ నిర్మాత అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

3 BHK సినిమా కథ విషయానికి వస్తే.. వాసుదేవన్ (శరత్ కుమార్) (భార్యగా దేవయాని) దంపతులకు ప్రభు (సిద్దార్థ్) ఆరతీ (మీతా రఘనాథ్) సంతానం ఉంటుంది. మధ్య తరగతి కుటుంబానికి ఎప్పటికైనా సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనే కల ఉంటుంది. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రభుకు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వాసుదేవన్‌ను ఆందోళనకు గురి చేసింది. తండ్రి ఆలోచనలకు, ఆశయాలకు ప్రభు దూరంగా ఉంటే.. కూతురు జీవితం భారీ కుదుపుకు లోనవుతుంది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాగే ఎమోషనల్ స్టోరీలో సొంత ఇంటిని సాకారం చేసుకొన్నారా? లేదా అనేది మూవీ కథ.

3 BHK Movie Day 2

యువ నిర్మాత అరుణ్ విశ్వ రూపొందించిన ఈ సినిమాలో భావోద్వేగాలతోపాటు, ఎమోషన్స్‌ భారీగా జొప్పించారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను శాంతి టాకీస్ బ్యానర్‌పై సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ తెలుగులో భారీగా రిలీజ్ చేసింది. ఈ సినిమాను సుమారుగా 250 స్క్రీన్లలో తెలుగు రాస్ట్రాల్లో విడుదల చేసింది.

అయితే ఈ సినిమాకు ఏకపక్షంగా హిట్ టాక్ వచ్చింది. అయితే టాక్‌కు అనుగుణంగా ఈ సినిమాకు కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను కంగారు పెడుతున్నది. ఈ సినిమా తొలి రోజు తమిళంలో 1 కోటి రూపాయలు నెట్, 2 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 75 లక్షలు నెట్ 1.5 కోట్ల గ్రాస్, తెలుగులో 50 లక్షలు నెట్, 1 కోటి రూపాయలు గ్రాస్, ఇక ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు నెట్, 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 3.25 నెట్, 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇక రెండో రోజు మౌత్ టాక్ ప్రభావంతో ఈ సినిమాకు కలెక్షన్లు పుంజుకొన్నాయి. వారాంతం కావడంతో వసూళ్లు పెరిగాయి. రెండో రోజు తమిళంలో 1.5 కోట్ల రూపాయలు నెట్, 3 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 1 కోటి రూపాయలు నెట్ 2 కోట్ల గ్రాస్, తెలుగులో 75 లక్షలు నెట్, 1.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 1 కోటి నెట్, 2 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో 4.25 కోట్ల నెట్, 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇక ఈ సినిమా రెండు రోజుల్లో 7.5 కోట్ల నెట్, 15 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే ఈ సినిమా రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమిస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని నమోదు చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: 3 BHK siddharth box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X