3 years of Rx 100: బాక్సాఫీస్ వద్ద కార్తికేయ బీభత్సం.. సీక్వెల్ ఎప్పుడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి, Rx 100 లాంటి సినిమాలు ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయనే చెప్పాలి. ప్రేక్షకుల మనసులు కూడా విబిన్నంగా మారుతున్నాయని అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇక ఆర్ఎక్స్ 100 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై అలాగే సీక్వెల్ ఎప్పుడు రాబోతోందనే విషయాలపై ఒక లుక్కేద్దాం..

ఎవరు ఊహించలేదు

ఎవరు ఊహించలేదు

బోల్డ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక అర్జున్ రెడ్డి లాంటి సినిమా అనంతరం మరింత హై వోల్టేజ్ కంటెంట్ తో వచ్చిన ఏకైక సినిమా ఆర్ఎక్స్ 100. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఊహించని విధంగా లాభాలను అంధించింది. ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు.

సాంగ్స్ తోనే భారీ హైప్

సాంగ్స్ తోనే భారీ హైప్

సినిమా విడుదలకు ముందే పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసింది. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్ యూ ట్యూబ్ లో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పిల్లారా సాంగ్ ను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. కార్తికేయ నటన, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ డోస్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంతంటే

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంతంటే

దర్శకుడు అజయ్ భూపతి చాలా మంది మీడియం హీరోల చుట్టూ తిరిగి ఫైనల్ గా కార్తికేయను ఫిక్స్ అయ్యాడు. ఇక సినిమా విడుదలైన మొదట రోజే యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 25కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాను కేవలం 2కోట్ల బడ్జెట్ తోనే నిర్మించి భారీ స్థాయిలో లాభాలను అందుకున్నారు.

Recommended Video

Karthikeya About Lavanya Tripathi | Hilarious Interview
సీక్వెల్ ఎప్పుడంటే?

సీక్వెల్ ఎప్పుడంటే?

బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు అజయ్ భూపతి గతంలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అతను మహాసముద్రం సినిమాను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా అనంతరం మళ్ళీ సీక్వెల్ తో రావచ్చని టాక్ అయితే వస్తోంది. మరి అజయ్ భూపతి సీక్వెల్ తో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X