3 Years of Taxiwala: సగం సినిమా లీకైనా బాక్సాఫీస్ ను షేక్ చేసిన విజయ్.. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమాతో కూడా తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. అయితే సినిమా విడుదలకు ముందే సగానికి పైగా సోషల్ మీడియాలో కూడా లీక్ అయిపోయింది. ఆ సమయంలో సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ చేసిన హడావుడికి మంచి ప్రాఫిట్స్ దక్కాయి.

కెరీర్ లో మరో బెస్ట్ హిట్

కెరీర్ లో మరో బెస్ట్ హిట్

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హోదా ఒక్కసారి పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన మహానటి గీత గోవిందం సినిమాలు కూడా అతనికి మంచి గుర్తింపును అందించాయి ముఖ్యంగా గీతగోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక ప్రాఫిట్స్ అందించిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన నోతా సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇక టాక్సీవాలా సినిమా మొత్తానికి మంచి సక్సెస్ ఇచ్చింది.

జనాలకు నచ్చే విధంగా

జనాలకు నచ్చే విధంగా

అసలైతే టాక్సీవాలా సినిమాను చాలా తొందరగా ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యంగా కొనసాగాయి. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ ను మళ్లీ మార్చారని కథనాలు కూడా వెలువడ్డాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ విజయ్ కు మంచి అనుబంధం ఉండడంతో ఇద్దరు కూడా ఒకరికొకరు సలహాలు తీసుకొని సినిమాను జనాలకు నచ్చే విధంగా తెరపైకి తీసుకువచ్చారు.

విడుదలకు ముందే లీక్

విడుదలకు ముందే లీక్

ఇక ఈ సినిమా విడుదలకు ముందే పైరసీ దారుణంగా దెబ్బ కొట్టింది. దాదాపు 45 నిమిషాల సినిమా తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో లీక్ అవ్వడంతో నిర్మాతలు చాలా కంగారు పడ్డారు. దాదాపు సినిమాపై ఏడు కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో యు.వి.క్రియేషన్స్ GA2 పిక్చర్స్ సినిమాకు కొంత అండగా నిలిచింది. తప్పకుండా సినిమా థియేటర్స్ లో జనాలకు నచ్చుతుంది అని భారీ స్థాయిలో విడుదల చేశారు. అంతే కాకుండా విజయ్ చేసిన ప్రమోషన్ సినిమాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది.

Recommended Video

Taxiwala Will Cross Geetha Govindam's TRP Record? | Filmibeat Telugu
బాక్సాఫీస్ కలెక్షన్స్

బాక్సాఫీస్ కలెక్షన్స్

ఏడు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 42 కోట్లకు పైగా వసూళ్లను అందించింది. దాదాపు 30 కోట్లకు పైగా నిర్మాతలు ప్రాఫిట్స్ అందుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఏదైనా సినిమాకు పైరసీ ప్రభావం పడితే బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ ఎంతో ధైర్యంగా ప్రమోషన్స్ చేసి జనాలను థియేటర్స్ వరకు వచ్చేలా చేశాడు.

కేవలం యూత్ ని మాత్రమే కాకుండా చిన్న పిల్లలను కూడా సినిమా ఎంతగానో థ్రిల్ చేసింది. హారర్ కాన్సెప్ట్ లో ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ట్యాక్సీ వాలా మొత్తానికి విజయ్ స్థాయిని మరో లెవెల్ కు పెంచేసింది. ఇక కష్టపడితే సక్సెస్ తప్పకుండా వస్తుందని విజయ్ మరోసారి టాక్సీవాలా సినిమా తో నిరూపించాడు. ఈ సినిమాలో ప్రియాంక జువల్కర్ హీరోయిన్ గా నటించగా మాళవిక నాయర్ ముఖ్యమైన పాత్రలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X