twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ప్రీ రిలీజ్ బిజినెస్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టాలంటే?

    |

    బుల్లితెరపై సక్సెస్ అయితే చాలా ఈజీగా బిగ్ స్క్రీన్ పై అవకాశాలు అందుకోవచ్చు. కానీ లాక్ అందరూ సక్సెస్ అవ్వలేరు. ఇక యాంకర్స్ కు ఉండే క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రియాలిటీ షోలు, టాక్ షోలు అంటూ ఎన్నో రకాల ఈవెంట్స్ తో క్రేజ్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై ఎంతవరకు క్లిక్ అవుతాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

    222 మిలియన్ల వ్యూవ్స్..

    222 మిలియన్ల వ్యూవ్స్..

    '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే ఆ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలను బాగానే క్రియేట్ చేసింది. ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు నీలి నీలి ఆకాశం పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యూ ట్యూబ్ లో ఆ సాంగ్ 222 మిలియన్ల వ్యూవ్స్ ను అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.

    విడుదల ఎప్పుడంటే..

    విడుదల ఎప్పుడంటే..

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మొత్తానికి జనవరి 29న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అసలైతే ఈ సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది. కరోనా లాక్ డౌన్ కంటే ముందే సినిమాను రెడీ చేశారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

    సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

    సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

    అయితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉన్నప్పటికీ ఆ టార్గెట్ ను ప్రదీప్ అందుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.4కోట్లని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం లో సినిమా 1.5కోట్ల ధర పలకడం విశేషం. ప్రదీప్ మొదటి సినిమా అయినప్పటికీ బిజినెస్ బాగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

    సీడెడ్ లో 55లక్షలు, ఆంధ్రాలో 2.1కోట్లు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 4.15కోట్లు బిజినెస్ చేస్తున్న ప్రదీప్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.4కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ 4.8కోట్లు. ప్రదీప్ ఈ రేంజ్ లో వసూళ్లు అందుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. సాంగ్ తో పాటు ట్రైలర్ కూడా బాగానే క్లిక్కయ్యింది. మరి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

    Recommended Video

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్

    English summary
    Suma Domination has always been one of the best anchors in the Telugu industry. However, Pradeep Machiraju is also among those who continue to be the best anchor after her. It is known that Pradeep made a movie as a hero who gained a lot of fans by interviewing top heroes very closely not only with reality shows but also with talk shows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X