twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4 Years of Arjun Reddy : టాలీవుడ్ అసలైన ట్రెండ్ సెట్టర్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

    |

    టాలీవుడ్ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. అయితే అందులో భారీ స్థాయిలో కలెక్షన్స్ తో పాటు కొన్ని సినిమాల్లో చిత్ర పరిశ్రమ రూపురేఖలను కూడా పూర్తిస్థాయిలో మార్చేశాయి. అలాంటి అతి కొద్ది సినిమాలలో అర్జున్ రెడ్డి రీమేక్ కూడా టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ , శాలిని పాండే బోల్డ్ పాత్రల్లో నటించారు. అర్జున్ రెడ్డి అనంతరం చాలా వరకు ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కే విధానంలో కూడా మార్పులు వచ్చాయి.

    రెండు గంటల సినిమా ఎక్కువ అని విమర్శలు వస్తున్న సమయంలో మూడు గంటల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అభిమానులు కూడా అర్జున్ రెడ్డి రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు.

    కంటెంట్ కు తగ్గట్లుగా రొమాంటిక్ సీన్స్

    కంటెంట్ కు తగ్గట్లుగా రొమాంటిక్ సీన్స్

    అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పెద్దలను కూడా ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఎంతోమంది దర్శకులు కూడా ఆ సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు. అగ్ర హీరోలు సైతం విజయ్ దేవరకొండ నటనకు ఫిదా అయ్యారు. సినిమాలోని ప్రతి ఒక్క అంశం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం హాట్ సీన్లు అని కాకుండా కంటెంట్ కు తగ్గట్లుగా రొమాంటిక్ సన్నివేశాలను ఎలా ఎలివేట్ చేయాలి అనే విషయాన్ని ఈ సినిమాలో కరెక్ట్ గా చూపించారు. దర్శకుడిగా సందీప్ రెడ్డికి మంచి గుర్తింపు దక్కింది.

    మరో బిగ్గెస్ట్ హిట్

    మరో బిగ్గెస్ట్ హిట్

    సినిమాలోని పాటలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరగడానికి ఎంతగానో హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెవర్ బిఫోర్ నెల మంచి వైబ్రేషన్ క్రియేట్ చేసింది. కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా అర్జున్ రెడ్డి శబ్దాలు వినిపించాయి. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు.

    బాక్సాఫీస్ కలెక్షన్స్

    బాక్సాఫీస్ కలెక్షన్స్

    టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ సినిమా అందించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఏరియాల వారీగా అందిన షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం - 7.61కోట్లు, సీడెడ్ - 1.82కోట్లు ఉత్తరాంధ్ర - 1.17 కోట్లు, ఈస్ట్ - 0.77 కోట్లు, వెస్ట్ - 0.50 కోట్లు గుంటూరు - 0.94 కోట్లు, కృష్ణా - 0.94 కోట్లు, నెల్లూరు - 0.35 కోట్లు..

    Recommended Video

    Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Filmibeat Telugu
    మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?

    మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?

    ఇక ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ టోటల్ గా ఈ మూవీ 14.10 కోట్ల వరకు షేర్ ను అందించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 7.25 కోట్లు. వరల్డ్ వైడ్ టోటల్ గా వచ్చిన కలెక్షన్స్ 21.35 కోట్లు. అర్జున్ రెడ్డి సినిమా 5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి రాగా ఓవరాల్ గా క్లోజింగ్ సమయానికి రూ. 21.35 Cr షేర్ దక్కించుకుని బయ్యర్స్ కి ఏకంగా రూ. 16 Cr లకు పైగా ప్రాఫిట్స్ ను అందించింది.

    English summary
    4 years of vijay devarakonda arjun reddy total box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X