45 The Movie Box Office: 45 మూవీకి డీసెంట్ కలెక్షన్లు.. శివరాజ్ కుమార్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, స్టార్ హీరో ఉపేంద్ర, డైరెక్టర్, యాక్టర్ రాజ్ బీ శెట్టి నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ 45. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ జన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేంద్రన్, జిషు సేన్ గుప్తా, పూజా రామచంద్రన్, సుధారాణి, విజయలక్ష్మీ సింగ్, ప్రమోద్ శెట్టి తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి, కేఎం ప్రకాశ్ ఎడిటింగ్, అర్జున్ సర్జా మ్యూజిక్ విభాగాలను పర్యవేక్షించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 2025 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ మూవీ సాధిస్తున్న కలెక్షన్ల వివరాలు ఎంతనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వినయ్ (రాజ్ బీ శెట్టి) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన తల్లి, గర్ల్‌ఫ్రెండ్ మేఘన (కౌస్తుభ మణి)తో కలిసి లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఓ రోజు తన ద్విచక్ర వాహనంపై హెల్మెట్ పెట్టుకోకుండా, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ స్థానిక డాన్ రాయప్ప (ఉపేంద్ర)కు చెందిన పెంపుడు కుక్క రోసిపై నుంచి వెళ్తాడు. దాంతో రాయప్ప కోపంతో వినయ్‌కు వార్నింగ్ ఇస్తాడు. రాయప్ప నుంచి రక్షించుకోవడానికి సామాజిక కార్యకర్త శివన్న (శివరాజ్ కుమార్)ను కలుస్తాడు. ఆ తర్వాత వినయ్, రాయప్ప మధ్య వివాదం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా కథ.
45 మూవీ సినిమా విషయానికి అగ్ర నటులు, టాలెంటెడ్ యాక్టర్లతో రూపొందించారు. ఈ సినిమాను రాజీ లేకుండా క్వాలిటీతో నిర్మించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 45 కోట్ల రూపాయలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 50 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. ఈ సినిమాకు భారీగా క్రేజ్ ఉండటంతో కన్నడలో 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో విడుదల చేశారు.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 55 కోట్ల రూపాయల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది. 45 మూవీకి సూపర్ స్టార్ వాల్యూ ఉండటంతో కన్నడలో ఓపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. ఈ సినిమాకు సుమారుగా 75 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. తొలి ఆట తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా నమోదు అయ్యాయి.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల జోష్‌ను కనబరుస్తున్నది. ఈ చిత్రం తొలి రోజున 4.25 కోట్ల నెట్, 5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని సాక్ నిక్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి ఆదరణ భారీగానే ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











