twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5 years Of Pelli Chupulu: అడుగడుగునా లాభాలే.. 80 లక్షలతో తీసిన సినిమా.. దిమ్మతిరిగే బాక్సాఫీస్ కలెక్షన్స్!

    |

    పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టినా కూడా ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి దెబ్బ వేస్తుంటుంది. నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఒకరు చాలా వరకు నష్టాలను చూస్తారు. అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం పట్టిందల్లా బంగారమే అనేలా ఉంటాయి. అలాంటి వాటోలో పెళ్లి చూపులు టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి పదింతలకు పైగా లాభాలను అందించి బిజినెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికి సంతోషాన్ని అందించింది.

    హాట్ సీన్ లేదు, ఐటెమ్ సాంగ్ లేదు

    హాట్ సీన్ లేదు, ఐటెమ్ సాంగ్ లేదు

    హీరోగా విజయ్ దేవరకొండ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తరుణ్ భాస్కర్ కలిసి పెళ్లి చూపులు కథ చెప్పాడు. అయితే వీరితో సినిమా చేసేందుకు మొదట్లో ఏ నిర్మాత కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఒక్క హాట్ సీన్ లేదు, ఐటెమ్ సాంగ్ లేదు అంటూ హేళన కూడా చేసినట్లు తరుణ్ భాస్కర్ కొన్ని ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పాడు.

    సినిమా కోసం ఎగబడ్డారు

    సినిమా కోసం ఎగబడ్డారు

    ఇక ఫైనల్ గా రాజ్ కందుకూరి యష్ రాగినేని సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాతావరణాన్ని అలాగే నేటితరం యువకుల మైండ్ సెట్ ను సినిమాలో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పెళ్లి చూపులు కాన్సెప్ట్ లో సరికొత్తగా కథను కొనసాగించి అందులోనే లవ్, కామెడీని హైలెట్ చేశారు. సినిమా కూల్ గా అనిపించడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.

    కేవలం 30 రోజుల్లోనే.. బడ్జెట్ ఎంతంటే

    కేవలం 30 రోజుల్లోనే.. బడ్జెట్ ఎంతంటే

    విజయ్ దేవరకొండ నటన ప్రియదర్శి కామెడీ కూడా సినిమాలో చాలా బాగా హైలెట్ అయ్యాయి. ఇక సినిమాలో డైలాగ్స్ చాలా న్యాచురల్ గా ఉండాలని డబ్బింగ్ లేకుండా అప్పటికప్పుడు సింక్ సౌండ్ లోనే షూటింగ్ చేశారు. కేవలం 30 రోజుల్లోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇక సినిమా కోసం బడ్జెట్ 80లక్షల వరకు ఖర్చయ్యిందట.

    సురేష్ బాబు బిజినెస్ మైండ్

    సురేష్ బాబు బిజినెస్ మైండ్

    నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా 2016లో పెట్టిన పెట్టుబడికి అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాగా కూడా పెళ్లి చూపులు సరికొత్త రికార్డులను అందుకుంది. ఇక సినిమాను సురేష్ బాబు సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను 1.5కోట్లకు కొనుగోలు చేసి లాభాలతో 60% నిర్మాతలకు వాటా ఇచ్చే విధంగా అగ్రిమెంట్ తీసుకున్నారు.

    Recommended Video

    Uppena Movie Review | ట్విస్ట్ నిజమే.. కానీ..!!
    మొత్తం లాభాలు ఎంతంటే?

    మొత్తం లాభాలు ఎంతంటే?

    పెళ్లి చూపులు సినిమా 10కోట్ల వరకు డిస్ట్రిబ్యూషన్ షేర్ ను అందించింది. ఇక శాటిలైట్ ద్వారా 2.5కోట్లు రాగా రీమేక్ హక్కుల ద్వారా మరో 3కోట్లు వచ్చయట. ఇక నిర్మాతకు, అలాగే రిలీజ్ చేసినందుకు సురేష్ బాబుకు చెరొక 5కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓవర్సీస్ బయ్యర్లకు కూడా సినిమా మంచి లాభాలను అంధించింది.

    ఇలా అన్ని దారుల్లో లాభాలు అందించి మొత్తంగా 15కోట్ల వరకు బిజినెస్ చేసింది. పెళ్లి చూపులు సినిమా హిట్టయిన అనంతరం సురేష్ బాబు తన ప్రొడక్షన్ లోనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు మరో అవకాశం ఇవ్వగా 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది.

    English summary
    Some short films are all about gold. It can be said that pelli chupulu are at the top in such a wato. The film manages to entertain as well as inform, bringing joy to everyone involved in the business
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X