twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లోజింగ్ కలెక్షన్ రిపోర్ట్: ‘స్పైడర్’ నష్టాలు ఎన్ని కోట్లో తెలుసా?

    మహేష్ బాబును నటించిన స్పైడర్ సినిమాను అన్ని థియేటర్లలో ఎత్తేశారు. సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి.

    By Bojja Kumar
    |

    Recommended Video

    "Spyder" Registered Average Collections In Overseas Box Office

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ దసరా కానుకగా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఆ అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా లేక పోవడంతో బాక్సాఫీసు వద్ద చతికిల పడిన సంగతి తెలిసిందే.

    మహేష్ బాబుకు ఉన్న స్టార్ ఇమేజ్ కారణంగా సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో 51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండ్రోజుల్లో రూ. 72 కోట్లు, 12 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే సినిమాకు ఇంత కలెక్షన్ వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు.

    భారీగా నష్టం, ఎంతంటే...

    భారీగా నష్టం, ఎంతంటే...

    తెలుగు, తమిళంలో విడుదలైన స్పైడర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 128 కోట్లుకు పైగా జరిగింది. ఇటీవలే సినిమా అన్నిచోట్ల ఎత్తేశారు. క్లోజింగ్ కలెక్షన్ వివరాలు ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్ ఏరియా వైజ్ కలెక్షన్(షేర్) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    నైజాం ఏరియాలో

    నైజాం ఏరియాలో

    నైజాం ఏరియాలో స్పైడర్ సినిమాకు ఓపెనింగ్స్ బావున్నప్పటికీ... సినిమా ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఓవరాల్‌గా రూ. 9.80 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

     సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో ‘స్పైడర్' చిత్రానికి క్లోజింగ్ సమయానికి రూ. 4.70 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.

     నెల్లూరు

    నెల్లూరు

    నెల్లూరు ఏరియాలో ‘స్పైడర్' చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్ రాలేదు. ఈ చిత్రం రూ. 1.85 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

     కృష్ణ ఏరియాలో కలెక్షన్

    కృష్ణ ఏరియాలో కలెక్షన్

    కృష్ణ ఏరియాలో ‘స్పైడర్' చిత్రానికి ఇప్పటి వరకు రూ. 2.55 కోట్లు మాత్రమే షేర్ వసూలైంది. ఈ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

     గుంటూరు ఏరియలో

    గుంటూరు ఏరియలో

    గుంటూరు ఏరియాలో స్పైడర్ చిత్రానికి ఇప్పటి వరకు రూ. 3.60 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. దీంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు.

     వైజాగ్ ఏరియాలో

    వైజాగ్ ఏరియాలో

    వైజాగ్ ఏరియాలో ‘స్పైడర్' మూవీ కలెక్షన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ఈ చిత్రం మొత్తం రూ. 3.90 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

    తూర్పుగోదావరిలో..

    తూర్పుగోదావరిలో..

    తూర్పుగోదావరి జిల్లాలో ‘స్పైడర్' చిత్రానికి ఆదరణ ఆశించిన స్థాయిలో లేక పోవడంతో అక్కడ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్‌కు రూ. 3.76 కోట్ల షేర్ మాత్రమే మిగిలింది.

     పశ్చిమ గోదావరిలో..

    పశ్చిమ గోదావరిలో..

    పశ్చిమగోదావరి జిల్లాలో కూడా సినిమాకు భారీ నష్టం తప్పలేదు. ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్‌కు రూ. 2.80 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.

    వరల్డ్ వైడ్‌గా...

    వరల్డ్ వైడ్‌గా...

    ఏపీ, తెలంగాణలో ఈ చిత్రానికి మొత్తం రూ. 32.96 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్‌లో రూ. 6.75 కోట్ల షేర్, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.60 కోట్ల షేర్, తమిళం మరియు మలయాళంలో కలిపి రూ. 13.90 కోట్ల షేర్ వచ్చింది. మొత్తం రూ. 128 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.... రూ. 62.21 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో దాదాపు రూ. 66 కోట్ల మేర నష్టం తప్పలేదు.

    English summary
    Prince Mahesh Babu starrer Spyder that released this Dussehra has recently completed its theatrical run. With a pre-release business of 128 cr worldwide, Spyder has lost more than 66 crores for distributors and exhibitors leaving a big hole in their pockets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X