Tourist Family Total Collections: 7 కోట్ల బడ్జెట్ 1200% ప్రాఫిట్.. టూరిస్ట్ ఫ్యామిలీ టోటల్ కలెక్షన్స్ ఎన్ని కో
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సిమ్రాన్ నటించిన రీసెంట్ ఫిల్మ్ టూరిస్ట్ ఫ్యామిలీ. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అభిషాన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకత్వం వహించడం విశేషం. యోగిబాబు, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాల్ కీలక పాత్రల్లో నటించారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? టోటల్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
టూరిస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ ఎంత?
మలయాళ భాషలో రూపుదిద్దుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందించారు. నజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. చిన్న బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. కేవలం 35 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడంతో రూ.7 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

టూరిస్ట్ ఫ్యామిలీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి పెద్ద ప్రమోషన్ జరగలేదనే చెప్పాలి. తమకు వీలైనంత మేరకు సినిమాను ప్రచారం చేశారు. ఇక ఈ చిత్రంలో సిమ్రాన్, ఆ తర్వాత యోగి బాబు, శశికుమార్ వంటి తారలు మాత్రమే స్టార్ కాస్ట్ గా ఉన్నారు. దీంతో పెద్దగా ప్రీరిలీజ్ బిజినెస్ జరగలేదు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా 8 కోట్ల వరకు షేర్, 16 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండింతులు విలువ కట్టారు.
టూరిస్ట్ ఫ్యామిలీ టోటల్ కలెక్షన్లు..
మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ జరగడంతో టూరిస్ట్ ఫ్యామిలీ థియేట్రికల్ రన్ 30 రోజులకు పైగా సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇక 32 రోజుల్లో ఈ చిత్రం ఇండియా నెట్ రూ.60.75 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.70.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.15.55 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ గా లాంగ్ రన్ లో 32 రోజుల్లో రూ.86.25 కోట్ల వరకు వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక మిగితా వసూళ్లు అన్నీ కలుపుకొని ఈ చిత్రం టోటల్ గా రూ.90 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
1200% ప్రాఫిట్ సాధించి..
ఇప్పటి వరకు ఇండియాలోని ప్రధాన భాషల్లో ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఛావా అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది. ఇక ఆ చిత్రాన్ని మించి టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం 1200% ప్రాఫిట్ ను సాధించి 2025లో విడుదలైన అన్నీ చిత్రాల్లో కంటే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications











