8 Vasantalu Box Office Collections: 8 వసంతాలు బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం 8 వసంతాలు. ఫణీంద్ర నరిశెట్టలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, కన్నా పసునూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహబ్ సంగీతం, సినిమాటోగ్రఫిని విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్ బాధ్యతలను శశాంక్ మాలి నిర్వర్తించారు. జూన్ 20 తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత? గత నాలుగు రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఊటీలో తేయాకు బిజినెస్‌ను కొనసాగించే తల్లికి అండగా ఉండే శుద్ది అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) బహుముఖ ప్రజ్ఞాశాలి. యుక్త వయస్సులోనే రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో పురుషులను కూడా మట్టికరిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి యువతి తన జీవితంలో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయాణిస్తుండగా.. ఆమె లైఫ్‌లోకి వరుణ్ (హను రెడ్డి) ఎంట్రీ ఇస్తాడు. కాశ్మీర్‌లో వారిద్దరు తరుచూ కలుస్తుండటంతో ఒకరితో మరొకరిని విడదీయలేనంత ప్రేమ కలుగుతుంది. ఈ క్రమంలో శుద్ధికి వరుణ్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. శుద్ది తన నిర్ణయం చెప్పాలనుకొన్న తరుణంలో వరుణ్ బ్రేకప్ చెప్పి అమెరికాకు వెళ్లిపోతాడు.

శుద్ది అయోధ్య జీవిత లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి ఏర్పడిన అవరోధం ఏమిటి? తన గురువు ప్రాణాలకు ఏర్పడిన ముప్పు ఆమెను ఎలా బాధించింది? వరుణ్‌పై ఎలాంటి ఆకర్షణకు లోనైంది. తనలోని ప్రేమను వ్యక్తీకరించే సమయంలో వరుణ్ ఎందుకు బ్రేకప్ చెప్పాడు? వరుణ్‌తో బ్రేకప్ కారణంగా మానసిక సంఘర్షణకు గురైన సమయంలో ఆమె సంజయ్ (రవి దుగ్గిరాల)కు ఎలా దగ్గరైంది? సంజయ్‌తో ఆమె ప్రయాణం ఎక్కడికి దారి తీసింది. వరుణ్, సంజయ్‌లో ఎవరి ప్రేమను గెలుచుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే 8 వసంతాలు సినిమా కథ.
ట్రాయాంగిల్ లవ్ స్టోరీతోపాటు మహిళా సాధికారిత అనే పాయింట్‌ను హైలెట్ చేస్తూ నిర్మించిన ఈ సినిమాలో అంతా నూతన నటీనటులే. అయితే ఈ సినిమా హై ఎండ్ క్వాలిటీతో రూపొందింది. ఇటీవల కాలంలో టెక్నికల్‌గా రిచ్‌గా ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సినిమాలు అరుదుగా కనిపిస్తాయి. ఈ సినిమాను సాంకేతికంగా బలంగా, రైటింగ్ పరంగా స్ట్రాంగ్‌గా రూపొందించారు. ఈ సినిమా నటీనటుల పారితోషికం కంటే ప్రొడక్షన్‌కే భారీగా ఖర్చు అయింది. ఈ సినిమాను సుమారుగా 10 నుంచి 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సొంతంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను 4 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ వాల్యూగా థ్రియేట్రికల్ రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అంతేకాకుండా నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న నటించిన కుబేర మూవీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు 25 లక్షలు నికరంగా 50 లక్షలు గ్రాస్, రెండో రోజు 30 లక్షల నెట్, 60 లక్షల గ్రాస్, మూడో రోజు 35 లక్షల నెట్, 60 లక్షల గ్రాస్, 4వ రోజు 15 లక్షల నెట్ 30 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో సుమారుగా 50 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక గత నాలుగు రోజుల్లో ఈ సినిమా నెమ్మదిగా బాక్సాఫీస్ వద్ద తన ఉనికిని గుర్తు చేస్తూ వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1 కోటికిపైగా నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లును రాబట్టింది. ఓవర్సీస్‌లో కలెక్షన్లు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











