8 Years For Sarrinodu బాక్సాఫీస్‌ను కుమ్మేసిన అల్లు అర్జున్.. 50 కోట్ల బడ్జెట్.. ఎన్ని కోట్ల వసూళ్లతో చరిత్ర అ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం అతడి కేరీర్‌కు స్టార్ స్టామినాను తెచ్చిపెట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అందరి అంచనాలు తలకిందులు చూస్తూ ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా బబాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన ఈ సినిమా ఏప్రిల్ 22 తేదీన 8వ సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
సరైనోడు సినిమా విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్, ఆది పినిశెట్టి, క్యాథరీన్ త్రెసా, శ్రీకాంత్, బ్రహ్మనందం, ప్రదీప్ రావత్, సుమన్ లాంటి అగ్ర నటీనటులు నటించిన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో అంతా కలిపి ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారు.

సరైనోడు సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై మిశ్రమ స్పందన కనిపించింది. క్రిటిక్స్ మిక్స్‌డ్ రివ్యూలతో బెంబేలెత్తించారు. అయితే అలాంటి టాక్‌ను ఎదురించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అల్లు అర్జున్‌కు సరైనోడు సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలువడమే కాకుండా భారీగా ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్, పాటలు ఆయనకు మాస్ హీరోగా ఇమేజ్‌ను మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టేటస్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకొన్న పరిస్థితి కనిపించలేదు.

ఇక సరైనోడు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట వసూళ్ల సునామీని క్రియేట్ చేసింది. ఆంధ్రా, నైజాంలో సుమారుగా 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం 11.5 కోట్ల రూపాయలు, కేరళలో 7 కోట్ల రూపాయలు, ఇతర రాస్ట్రాల్లో 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇదిలా ఉండగా, బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా అప్పట్లో ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం విశేషంగానే చెప్పుకొన్నారు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 127 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











