8 years of Attarintiki Daredi: పవర్ స్టార్ ఇండస్ట్రీ హిట్.. పైరసీ దెబ్బ కొట్టినా తగ్గని కలెక్షన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదా ఏమిటో మరోసారి అత్తారింటికి దారేది సినిమాతో రుజువైంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే నేటితో సరిగ్గా 8 ఏళ్లు అవుతోంది. గబ్బర్ సింగ్ లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మళ్లీ పవర్ స్టార్ బాక్సాఫీస్ పంజను చూపించాడు. 2013 అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సందడి మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదాకు తగ్గట్టుగా మరొకసారి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది.

 పైరసీ దెబ్బ పడినా..

పైరసీ దెబ్బ పడినా..

సాధారణంగా ఏ సినిమాకైనా సరే పైరసీ దెబ్బ పడితే బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ అంచనాలకు భిన్నంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా మాత్రం ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం. దాదాపు సగం సినిమా మొత్తం ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది అది కూడా ఒరిజినల్ ప్రింట్ కావడంతో సినిమా వెండితెరపై అంతగా సక్సెస్ కాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా అత్యధిక వసూళ్లను అందుకున్న రెండవ సినిమాగా కూడా అత్తారింటికి దారేది వండర్స్ క్రియేట్ చేసింది.

 నటుడిగా పవర్ స్టార్ సరికొత్తగా

నటుడిగా పవర్ స్టార్ సరికొత్తగా

పవన్ కళ్యాణ్ చాలా వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్త ఫ్యామిలీ కథ తో ఆకట్టుకున్నాడు. అత్త కోసం వెళ్లే మేనల్లుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఒకవైపు తన హీరోయిజాన్ని మరోవైపు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ మ్యాన్ గా చక్కని నటనను కనబరిచాడు. క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలోను ఆ స్థాయిలో నటించలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

 మొదట ఆ హీరోయిన్ ను అనుకొని..

మొదట ఆ హీరోయిన్ ను అనుకొని..

అసలైతే ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందే తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇవ్వడం వలన గబ్బర్ సింగ్ సినిమాను ముందుగా పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ సినిమా విజయం సాధించడం కూడా అత్తారింటికి దారేది సినిమాకు ఎంతగానో హెల్ప్ అయింది. ఇక ఈ సినిమాలో మొదట ఇలియానా హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారట కానీ ఆ తర్వాత మళ్ళీ సమంత వైపు ఫోకస్ చేశారు. సమంత, ప్రణీత కూడా ఈ సినిమాలో గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నదియా పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు

సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోవడంలో అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ ప్రింట్ సగానికిపైగా ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది. దీంతో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజే హౌజ్ ఫుల్ బోర్డ్ లతో థియేటర్స్ దర్శనమిచ్చాయి. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమా కూడా ఆ స్థాయిలో హిట్టవ్వలేదు. అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా అత్తారింటికి దారేది మొదటి వారం లోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

75కోట్ల వసూళ్లు

75కోట్ల వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తంగా 75 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఏ సినిమా కూడా ఆ స్థాయిలో వసూలు చేయలేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఫ్యామిలీ కథ కాబట్టి నార్మల్ గానే ఆడుతుందని అనుకున్నారు. కానీ ఎవరూ ఉహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సునామీ క్రియేట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కు తగిన స్టోరీ పడితే ఎలా ఉంటుందో మరోసారి రుజువైందని అగ్ర దర్శకులు కూడా వివరణ ఇచ్చారు.

Recommended Video

Ram Vs Ravan Movie Opening Event | డైరెక్టర్ మారుతి చేతులమీదుగా
 మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే..

మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే..

ఇక 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినటువంటి అత్తారింటికి దారేది సినిమా మొత్తం బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల షేర్లు రాబట్టింది. అమెరికాలో కూడా ఈ సినిమా వన్ మిలియన్ డాలర్స్ అందుకున్న రెండవ సినిమాగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక పెట్టిన పెట్టుబడికి సినిమా నిర్మాతలకు 25 కోట్లకు పైగా లాభాలను అందించింది. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ స్థాయి కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమా విడుదలై ఎనిమిదేళ్ల అయినా కూడా టీవీలో వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాను చూసే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టని ఈ సినిమా ప్రతిసారి టీఆర్పీలో కూడా తన సత్తా చాటుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X