800 Movie Collections ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌కు భారీ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 800. క్రికెటర్‌గా రాణించడానికి ముత్తయ మురళీధరన్ ఎదుర్కొన్న అవమానాలు, వివక్ష, అప్రతిష్టను ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీపతి సక్సెస్ అయ్యారు. వివేక్ రంగాచారి నిర్మాతగా, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్‌గా మధుర్ మిట్టల్, ఆయన భార్యగా మహిమా నంబియార్, కీలక పాత్రల్లో నాజర్, ఆడుక్కాలమ్ నరేన్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
800 మూవీ సినిమాను లండన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియాలోని పలు స్టేడియాల్లో చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారు 20 కోట్ల రూపాయలతో రంగాచారి నిర్మించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో 1100 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఎక్కువగా మల్టీప్లెక్స్‌లోనే రిలీజ్ చేయడం గమనార్హం.

800 మూవీని ఓవర్సీస్‌లో లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నది. తెలుగు రాష్ట్రాలలో నైజాం ఏరియాలో సునీల్ నారంగ్ చెందిన ఏషియన్ ఫిలింస్, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో దిల్ రాజు, ఈస్ట్ గోదావరిలో గీతా ఫిలింస్, వెస్ట్ గోదావరిలో ఎల్వీ ఆర్, కృష్ణా జిల్లాలో అన్నపూర్ణ స్టూడియోస్, నెల్లూరు జిల్లాలో అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి, సీడెడ్‌లో ఎస్ సినిమాస్, గుంటూరు జిల్లాలో పద్మాకర్ సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో యుఎఫ్ఓ సంస్థ 800 చిత్రాన్ని కూడా డిస్టిబ్యూట్ చేస్తున్నది.
800 మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు ప్రదర్శించిన ప్రీమియర్లకు భారీ రెస్సాన్స్ వచ్చింది. ఇండియాలో ఈ సినిమాకు క్రిటిక్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు. దాంతో ఈ సినిమాకు భారీ ఒపెనింగ్స్ నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమాకు మౌత్ టాక్‌తో రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
800 మూవీ తమిళ భాషలో రూపొందగా, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాను సింహళీ భాషలో కూడా రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు తమిళనాడు, శ్రీలంకలో భారీ రెస్పాన్స్ కనిపించింది. ఈ రెండు ప్రదేశాల్లో మంచి ఆక్యుపెన్సీ కూడా నమోదైంది. అలాగే ఈ సినిమా తెలుగు, హిందీలో కూడా పాజిటివ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపించింది.
800 మూవీ సినిమాలో పేరున్న నటీనటులు లేకపోయినా ముత్తయ్య మురళీధరన్‌కు ఉన్న ఫాలోయింగ్, ఆయన చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాల వల్ల భారీగా బుకింగ్స్ జరిగింది. ఈ సినిమా తొలి రోజు సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











