9 years of Baahubali: చరిత్ర సృష్టించిన బాహుబలి.. 180 కోట్ల బడ్జెట్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమ ప్రతిష్టాను ప్రపంచానికి చాటి చప్పిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా సంచలన విజయాన్ని అందుకొన్నది. ఇక కొత్త జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. రూపొందించిన జానపద కథా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో బ్లాక్‌బస్టర్‌గా మారింది. ఈ సినిమా జూలై 10వ తేదీన 9 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే..

రాజమౌళి తండ్రి వీ విజేంద్రప్రసాద్ రాసిన కథను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, దేవసేన, శివగామి, భళ్లాలదేవ పాత్రల మధ్య జరిగే డ్రామాను అద్బుతంగా తెరక్కించారు.

9 years of Baahubali Prabhas and SS Rajamouli gets pan india image

బాహుబలి: ది బిగినింగ్ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.ఈ సినిమాలోని పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాను. పాటలు మాత్రమే కాదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ సినిమా జూలై 10వ తేదీ 2015 సంవత్సరంలో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది.

బాహుబలి పార్ట్ 1 సినిమాను సుమారుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబట్టింది.

9 years of Baahubali Prabhas and SS Rajamouli gets pan india image

బాహుబలి రిలీజ్ తర్వాత విడుదలైన ప్రతీ చోట భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో 176 కోట్ల రూపాయలు, తమిళనాడులో 64 కోట్ల రూపాయలు, కర్నాటకలో 77 కోట్ల రూపాయలు, కేరళలో 14.5 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా 155 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 87 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారుగా 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

బాహుబలి సినిమా సక్సెస్ కావడం.. ఆ సినిమా క్లైమాక్స్‌లో బాహుబలిని కటప్ప వెన్నుపోటు పొడిచే సన్నివేశం పాపులార్ కావడంతో బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేసింది. ప్రధాని మోదీ నుంచి ప్రతీ సాధారణ పౌరుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నను లేవనెత్తడం తెలుగు సినిమా చరిత్రను తిరగరాసేలా చేసింది. ఈ సినిమాతో దేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న దర్శకుడిగా రాజమౌళి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు.

More from Filmibeat

Read more about: baahubali ss rajamouli prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X