twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    9 years of Eega: క్లోజింగ్ కలెక్షన్స్.. సీక్వెల్ చేసే ఐడియా ఉంది.. కానీ...

    |

    దర్శకధీరుడు రాజమౌళిని సినిమా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసిన సినిమా ఈగ. మహాదీర లాంటి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అనంతరం మళ్ళీ చిన్న సినిమా చేయాలని అనుకున్న రాజమౌళి అనుకోకుండా ఈగ కాన్సెప్ట్ కు కనెక్ట్ అయ్యాడు. ఆరు నెలల్లో పూర్తి చేద్దామనుకున్న ఆ సినిమా రెండేళ్లకు విడుదలయ్యింది. ఇక సినిమా సీక్వెల్ పై కూడా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు.

    అనుకున్నట్లుగానే

    అనుకున్నట్లుగానే

    ఈగ సినిమా వచ్చి నేటికి 9 ఏళ్లవుతోంది. 2012 జూలై 6న గ్రాండ్ గా విడుదలయ్యింది. విడుదలకు ముందే పోస్టర్స్ తో ట్రైలర్ తో భారీగా బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా తప్పకుండా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ ముందే ఊహించారు. అనుకున్నట్లుగానే ఓపెనింగ్స్ తోనే ఈగ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    రక్త చరిత్ర 2 చూసి..

    రక్త చరిత్ర 2 చూసి..

    నాని - సమంత హీరో హీరోయిన్స్ గా నటించగా కన్నడ స్టార్ సుదీప్ విలన్ పాత్రలో నటించారు. రక్త చరిత్ర 2లో సుదీప్ నటన చూసి రాజమౌళి ఫిదా అయ్యాడు. వెంటనే అతని ఫిక్స్ చేసి సినిమా వర్క్ షాప్ కు పిలిచారు. ఇక సినిమాను మొదట ఆరు నెలల్లో పూర్తి చేయాలని అనుకోని స్టార్ట్ చేయగా ఆ తరువాత రెండేళ్లకు రిలీజ్ చేయాల్సి వచ్చింది.

    కీరవాణి మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్

    కీరవాణి మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్

    ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఒక ఎత్తైతే కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా మరొక ప్రాణంలా నిలిచింది. విజువల్ ఫస్ట్ గా ప్రేక్షకులకు కనువిందును అందించిన ఈ సినిమాలో సుదీప్ పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. హీరోగా నాని కొంత సేపు మాత్రమే కనిపించినప్పటికి తన బెస్ట్ ఇచ్చాడు. సమంత కూడా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది.

    కలెక్షన్స్ ఎంతంటే

    కలెక్షన్స్ ఎంతంటే

    ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే వారాహి ప్రొడక్షన్స్ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కూడా సినిమాను సంయుక్తంగా నిర్మించింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.33.61కోట్లు చేసింది. తెలుగు తమిళ్ హిందీ మళయాళం అన్ని భాషల్లో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 57.16కోట్ల వసూళ్లను అందుకుంది. అంటే బయ్యర్లకు దాదాపు 23కోట్ల వరకు లాభం వచ్చినట్లు సమాచారం.

    Recommended Video

    Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
    ఈగ సీక్వెల్.. సిద్ధమే కానీ..

    ఈగ సీక్వెల్.. సిద్ధమే కానీ..

    ఇక సినిమాకు సంబంధించిన సీక్వెల్స్ పై గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ ఈగ సీక్వెల్ పై ఒక కామెంట్ అయితే చేశారు. ఈగ సీక్వెల్ ఐడియా అయితే రెడీగా ఉంది గాని అది ఫ్యూచర్ లో రాకపోవచ్చనే కామెంట్ కూడా చేశారు. ఎందుకంటే రాజమౌళి ఈగ కోసం చాలా కష్టపడ్డాడు. ఒకనొక సమయంలో అయితే మధ్యలోనే అపెయ్యాలని కూడా ఒక అనుకున్నట్లు ఇంటర్వ్యూలో కూడా అన్నారు. మరి సీక్వెల్ ఆలోచన భవిష్యత్తులో ఆచరణలోకి వస్తుందో లేదో చూడాలి.

    English summary
    Eega is the latest film to introduce director Rajamouli to the world of cinema. Rajamouli, who wanted to make a short film again after the biggest box office hit like Magaadheera, accidentally connected to Eega Concept. The film, which was expected to be completed in six months, was released in two years. Writer Vijayendra Prasad also gave a clarification on the movie sequel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X