Balakrishna:బాలయ్య బాబా మజాకా... రూ.300 కోట్ల సినిమాలు అంటే మాటలా?
నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన తాజాగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో రికార్డు సృష్టించిన బాలయ్య.... తాజాగా మరో రికార్డు సాధించారు. అసలు ఆయన ఏ రికార్డు సృష్టించారు.. భగవంత్ కేసరి కలెక్షన్లు ఎలా ఉన్నాయి.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కరోనా టైం నుంచి నందమూరి నటసింహం బాలయ్యకు మంచి కాలం నడుస్తోంది. కరోనా టైంలో అందరూ సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్న వేళ.. బాలయ్య మాత్రం అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు నటించింది. బోయపాటి దర్శకత్వం.. తమన్ సంగీతం.. బాలయ్య డైలాగులు, యాక్షన్ సీన్స్... బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఏకంగా ఈ సినిమా వంద కోట్లు సాధించి బాలయ్య కెరియర్లో మైలు స్టోన్ గా నిలిచింది.

ఇక ఆ తర్వాత ఈ ఏడాది బాలకృష్ణ వీరసింహరెడ్డి సినిమాతో ప్రేక్షుకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. దీనికి కూడా తమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు దీటుగా వీరసింహరెడ్డి కలెక్షన్లు సాధించాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయలకు పైగా సాధించి రికార్డులు సృష్టించింది.
ఇక తాజాగా ఆయన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటించింది.లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కలెక్షన్లను దాటుకుని భగవంత్ కేసరి సినిమా కలెక్షన్లను రాబడుతోంది.

ఇక భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్టుగా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ సినిమా రూ104 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో బాలయ్య... హ్యాట్రిక్ కొట్టాడు. ఇక వరుసగా మూడు సినిమాలతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టడంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వరుసగా వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టి... బాలయ్య రికార్డు సృష్టించాడు.

ఇక బాలయ్య వరుసగా మూడు సినిమాలు మూడు వందల కోట్లు కొల్లగొట్టడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలయ్య బాబా మజాకా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం న్యూ లుక్ లోకి మారిపోయాడు.


Click it and Unblock the Notifications











