ఆర్ఆర్ఆర్ కి అదిరే న్యూస్.. ఇక లెక్కలు మారుతున్నాయి.. ఇంకా అంతా సిద్ధం!

కరోనా మహమ్మారి ఏడాదిన్నరగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు అనేకమంది వ్యాక్సిన్ తీసుకోవడంతో చాలా వరకు కేసు లు మన దేశంలో తగ్గుముఖం పట్టాయి. దానితో కొన్ని నెలల నుండి పూర్తిగా బయటకు వస్తున్న ప్రజలు సినిమా థియేటర్స్ కి రావడం కూడా మొదలెట్టారు. ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ మూవీ థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. అక్కడి నుండి వరుసగా అనేక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయ్యాయి. అయితే ఒక హిందీ సినిమా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు మంచి ఆశలు కల్పిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

సూర్యవంశీ కూడా

సూర్యవంశీ కూడా

ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ లో విడుదలైన భారీ మల్టీస్టారర్ మూవీ సూర్యవంశీ కూడా అక్కడ పెద్ద సక్సెస్ సాధించి ఇకపై థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాలకు మంచి ఊపునిచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్ లభిస్తోంది. త్వరలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సహా అనేక సినిమాలకు ఇది మంచి బాట చూపింది. అసలు థియేటర్స్ లో తమ సినిమా రిలీజ్ చేస్తే ఎంతవరకు ఆడియన్స్ వస్తారు అనే అనుమానాలు పూర్తిగా తొలగడంతో ఆర్ ఆర్ ఆర్ కనుక బ్లాక్ బస్టర్ కొడితే బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండినట్లే అంటున్నారు అనలిస్టులు.

ఎన్టీఆర్, చరణ్ టీజర్స్ తో భారీ హైప్

ఎన్టీఆర్, చరణ్ టీజర్స్ తో భారీ హైప్

ఇక ఆర్ఆర్ఆర్ ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తోందా డివివి దానయ్య దీనిని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి. భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఏ సినిమాలో, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఫస్ట్ సాంగ్ అదుర్స్ సెకండ్ సాంగ్ కోసం వెయిటింగ్

ఫస్ట్ సాంగ్ అదుర్స్ సెకండ్ సాంగ్ కోసం వెయిటింగ్

ఇక ఈ సినిమా నుండి కొన్నాళ్ల క్రితం ఏకంగా ఐదు భాషల్లో విడుదలైన దోస్తీ సాంగ్ అన్ని భాషల శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు భాషలకు చెందిన ఆ సాంగ్ ని ప్రముఖ సింగర్స్ ఆలపించగా తెలుగులో హేమచంద్ర ఎంతో అద్భుతంగా పాడారు. కీరవాణి అందించిన సూపర్ మ్యూజిక్ ఈ సాంగ్ సూపర్ సక్సెస్ కి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఈనెల 10న నాటు నాటు అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు యూనిట్ మొన్న ప్రకటించింది. ఆపైన మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ కానున్నాయి.

లేట్ అయినా లేటెస్ట్ గా రికార్డ్స్ బద్దలు

లేట్ అయినా లేటెస్ట్ గా రికార్డ్స్ బద్దలు

ఇక ఈ ఆర్ఆర్ ఆర్ మూవీ పై మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమాల తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో పాటు తొలిసారిగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాకి ఇంత భారీ హైప్ రావడానికి కారణం. మరోవైపు ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ వంటివి సినిమాపై సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకోవడంతో దీనిపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
రికార్డ్స్ ఖాయం

రికార్డ్స్ ఖాయం

అయితే అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అత్యద్భుతంగా రాజమౌళి ఈ సినిమాని తీర్చిదిద్దారని, లేట్ గా రిలీజ్ అవుతున్నప్పటికీ లేటెస్ట్ గా గత రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టి ఇండియన్ మూవీ హిస్టరీ లో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. కాగా ఈ సినిమా 2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X