A.R.M Movie Collections: టోవినో థామస్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
మలయాళంలో స్టార్ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం A.R.M (Ajayante Randam Moshanam). తొలి చిత్ర దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తెరకెక్కించారు. ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి జోసెఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ఇండియన్ హిస్టరీలో 1900 నుంచి 1990 వరకు జరిగిన కథా నేపథ్యంతో మూడూ జనరేషన్ల బ్యాక్ డ్రాప్‌తో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల కాలంలో అత్యధికంగా సాంకేతిక నైపుణ్యంతో ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.

టోవినో థామస్ నటించిన ఈ సినిమా సుమారుగా 35 కోట్ల రూపాయల షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ సినిమా కేరళలో తప్ప మిగితా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా కేరళలో 60 శాతం ఆక్యుపెన్సీ, అలాగే ఆంధ్రాలో 20 శాతం ఆక్యుపెన్సీ, తమిళంలో 35 శాతం ఆక్యుపెన్సీ, కన్నడలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.
ఇక కేరళలో ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 40 లక్షలు, కన్నడలో 60 లక్షలు, తమిళంలో 70 లక్షల రూపాయల నికర వసూళ్లు సాధిస్తుందని వెల్లడించారు. దాంతో దక్షిణాదిలో ఈ సినిమా 4.2 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు కలిపి ఇండియాలో 5 కోట్లు వసూలు చేయవచ్చని పేర్కొన్నారు.

ఇక ఓవర్సీస్‌లో కూడా పాజిటివ్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం మొదలైంది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా నమోదైంది. తొలి రోజు కూడా ఓ మోస్తారు ఆక్యుపెన్సీ కూడా నమోదై మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











