A.R.M Movie Collections: టొవినో థామస్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ఇండియన్ హిస్టరీలో 1900 నుంచి 1990 వరకు జరిగిన కథా నేపథ్యంతో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం A.R.M (Ajayante Randam Moshanam). జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి జోసెఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా గత రెండు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మూడూ జనరేషన్ల బ్యాక్ డ్రాప్‌తో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల కాలంలో అత్యధికంగా సాంకేతిక నైపుణ్యంతో ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. మలయాళంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. 35 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

A R M Movie Day 2 Expected Box Office Collections Worldwide

ARM మూవీ విషయానికి వస్తే.. సానుకూలమైన కలెక్షన్లను సాధించింది. కేరళలో ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, తెలుగులో 30 లక్షలు, తమిళంలో 70 లక్షలు, కన్నడలో 25 లక్షల రూపాయలు, హిందీలో 30 లక్షలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

టోవినో థామస్ నటించిన ఈ సినిమా కేవలం మలయాళం ప్రేక్షకులకే పరిమితమైంది. రెండో రోజు ఈ సినిమా సుమారుగా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. కొట్టాయం, కొల్లాం, కొజికోడ్, హైదరాబాద్, కోచి ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అయితే మౌత్ టాక్ పుంజుకొంటే వారాంతంలో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

A R M Movie Day 2 Expected Box Office Collections Worldwide

తెలుగులో ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోతున్నది. 2డీ, 3డీ వెర్షన్లకు అంతంత మాత్రమే స్పందన లభిస్తున్నది. వరంగల్ మినహా ఏ ప్రాంతంలోను పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రెండోరోజు తమిళంలో కూడా పేలవమైన ఆక్యుపెన్సీ కనిపించింది.

ఇదిలా ఉండగా, రెండో రోజు కూడా మలయాళంలో మరో 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మిగితా రాష్ట్రాల్లో మరో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2 నుంచి 3 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మరో 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 13 నుంచి 14 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవచ్చు.

More from Filmibeat

Read more about: a r m tovino thomas kriti shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X