OG Business: పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ ఊచకోత మొదలు.. OG బిజినెస్ చూస్తే కళ్ళు చెదరాల్సిందే!
బయట రాష్ట్రాల్లో ఏమో కానీ మన అడ్డా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. తన కెరీర్ పీక్ లో రాజకీయాల్లోకి వచ్చేసి ఆ తర్వాత కూడా ఏవో రీమేక్ చిత్రాలు చేస్తూనే పవన్ కళ్యాణ్ ఆల్ రికార్డులు సెట్ చేసిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అంతెందుకు తన సినిమాకి వర్క్ చేసే దర్శకుడు ఎవరు అని కొన్ని సినిమాలకి అయితే గూగుల్ చేసి వెతికితే తప్ప తెలిసే పరిస్థితి ఉండేది కాదు మరి అలాంటి సినిమాలతో కూడా పవన్ భారీ ఓపెనింగ్స్ సాధించారు. కాగా అలాంటి క్రేజ్ ఉన్న పవన్ నుంచి ఒక సరైన స్ట్రైట్ సినిమా అది కూడా మంచి దర్శకుడు నుంచి పడితే దాని ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం తన లేటెస్ట్ సినిమా "ఓజి" అని చెప్పాలి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా దీనిపై ఉన్న హైప్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో లెవెల్.. అందుకే పవన్ కి సరైన సినిమా పడితే దాని దెబ్బ ఎలా ఉంటుందో ఇపుడు ఓజి చూపిస్తుందట. కాగా లేటెస్ట్ గా ట్రేడ్ వర్గాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓజి సినిమా రికార్డు బిజినెస్ చేస్తుందట. ఓజి బిజినెస్ ఏ లెవెల్లో ఉందంటే ఇది ఎలాంటి సీక్వెల్ సినిమా లాంటిది కూడా కాకపోయినప్పటికీ ఆ రేంజ్ లో బిజినెస్ చేస్తుందట.
అలా ఒక్క ఆంధ్రా ఏరియాలో అది కూడా సీడెడ్ ప్రాంతాన్ని మినహాయించి ఏకంగా 70 కోట్ల బిజినెస్ ని ఓజి థియేట్రికల్ గా చేసిందట. ఒక సీక్వెల్ కాని సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ అంటే అది పవర్ స్టార్ కి సరైన సినిమా పడితే దానికి వచ్చే మొత్తం అని చెప్పాలి. అలా సీడెడ్ కాకుండానే 70 కోట్లు చేసిన ఓజి టోటల్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 150 కోట్లకి పైగా బిజినెస్ ని ఈజీగా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అలాగే 150 నుంచి 180 కోట్ల మధ్యలో ఓజి హక్కులు పలికే ఛాన్స్ ఉందట. ఇది కానీ నిజం అయితే పలు పాన్ ఇండియా సినిమాల తాలూకా సీక్వెల్ బిజినెస్ ని పవన్ ఒక్క సినిమాతోనే చూపించాడు అని చెప్పొచ్చు. కాగా ఓజి కి ఉన్న ఊపులో గాని హిట్ టాక్ పడితే మాత్రం వసూళ్లు నెక్స్ట్ లెవెల్లో వస్తాయని చెప్పొచ్చు.
అసలే పవన్ ఇపుడు డిప్యూటీ సీఎం కూడా ఈ కిక్ తో ఫ్యాన్స్ సినిమాని మరింత ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ నంబర్స్ ఏ మేరకు వస్తాయి అనేది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించగా వచ్చే ఏడాది అయితే ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











