twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2015 లో రిలీజయ్యే తొలి తెలుగు సినిమా

    By Srikanya
    |

    హైదరాబాద్: సంవత్సరం ప్రారంభంలో ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఎప్పుడూ సినిమా లవర్స్ కు ఆసక్తే. వచ్చే సంవత్సరం ప్రారంభంలో తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా వివరాలు ఇస్తున్నాం. ఆ చిత్రం మరేదో కాదు...షఫి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఎ శ్యామ్ గోపాల్‌వర్మ ఫిల్మ్' . దీనికి ‘నా సినిమా నా ఇష్టం' అనేది ఉప శీర్షిక. సమష్టి క్రియేషన్స్ పతాకంపై విజయకుమార్ రాజు, రాకేశ్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జోయాఖాన్ హీరోయిన్.

    ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

    దర్శకుడు రాకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ-‘‘ ఇందులో నటుడిగా షఫిలో కొత్తకోణాన్ని చూస్తారు. రక్తపాతం ప్రధానంగా సినిమాలు తీసే శ్యామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడు దాని వల్ల చివరకు ఎలాంటి ఫలితాన్ని పొందాడనేది ఇందులో ప్రధానాంశం. సెటైరికల్ కామెడీ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాం''అని చెప్పారు.

    'A Shyam Gopal Varma Film' release on Jan1st.

    నిర్మాత విజయ్‌కుమార్ రాజు మాట్లాడుతూ- ‘‘వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం''అని పేర్కొన్నారు. శ్యామ్‌గోపాల్ వర్మ పాత్రలో ఆసక్తికరమైన అంశాలు దొరికాయనీ, నటనకు అవకాశమున్న పాత్ర అనీ షఫీ అన్నారు. ఇది తనకు తొలి దక్షిణాది చిత్రమని జోయాఖాన్ చెప్పారు. ఇలాంటి కొత్త తరహా చిత్రానికి కొత్త తరహాలో సంగీతాన్ని అందించే అవకాశం లభించిందని సంగీత దర్శకుడు ‘మంత్ర' ఆనంద్ తెలిపారు.

    హింస, రక్తపాతం ప్రధానంగా సినిమాల్ని రూపొందించే ఓ దర్శకుడు చివరకు జీవితంలో ఏం సాధించాడు? అతడి కెరీర్‌లో చోటుచేసుకున్న ఆసక్తికరమైన మలుపులేమిటి? అనే అంశాలకు సున్నితమైన హాస్యాన్ని, వ్యంగ్యాన్ని మేళవించి ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ (నా సినిమా నా ఇష్టం) చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు

    శివకృష్ణ, జయప్రకాష్‌రెడ్డి, ఎల్.బి.శ్రీరాం, సూర్య, పృథ్వీరాజ్, తెలంగాణ శకుంతల, కొండవలస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌శ్రీవాత్సవ్, సంగీతం: మంత్ర ఆనంద్, ఆర్ట్: పార్థసారధి వర్మ, ఎడిటర్: కార్తీకశ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్‌శ్రీనివాస్.

    English summary
    'A Shyam Gopal Varma Film' will be the first Telugu release of 2015 on Jan1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X