A1 Express first Day collections: సందీప్ కిషన్ బాక్సాఫీస్ పోరాటం.. ఇక ఆశలన్నీ ఆదివారంపైనే!
యువ హీరో సందీప్ కిషన్ కెరీర్ మొదటి నుంచి కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. భాషతో కూడా సంబంధం లేకుండా తమిళ్ తెలుగులో వారుసగా సినిమాలు చేస్తున్న సందీప్ ఎక్కువగా తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ తో A1 ఎక్స్‌ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

తమిళ్ రీమేక్ తో..
కరోనా అనంతరం బాక్సాఫీస్ వద్ద మంచి సినిమాలకు ఆదరణ బాగానే అందుతోంది. నాంది లాంటి ప్రయోగాత్మకమైన సినిమా కూడా జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ కూడా అదే తరహాలో సక్సెస్ కొట్టాలని 'నాట్పే తునై' అనే తమిళ సినిమా రీమేక్ తో వచ్చాడు.

పాజిటివ్ టాక్ రావడంతో..
సందీప్ కిషన్ బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది. ఇక A1 ఎక్స్ ప్రెస్ సినిమాపై అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హాకీ గేమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు అయితే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ ఆశతో ఉంది. ఇక రివ్యూలు కూడా పరవాలేదు అనే విధంగానే వచ్చాయి.

మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్
ఇక సినిమా మొదట రోజు అందుకున్న కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
నైజాం 24లక్షలు, సీడెడ్ 8లక్షలు, ఉత్తరాంధ్ర 10లక్షలు, ఈస్ట్ 8లక్షలు, వెస్ట్ 5.8లక్షలు, గుంటూరు 7.2లక్షలు, కృష్ణా 7.1లక్షలు, నెల్లూరు 5.5లక్షలు. ఏపీ తెలంగాణలో మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ 0.76కోట్లు. గ్రాస్ 1.30కోట్లు.

ఇంకా ఎంత రావాలంటే..
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.6కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.6కోట్లు మాత్రమే. సందీప్ గత సినిమాలతో పోలిస్తే ఈ టార్గెట్ కాస్త పెద్దదే. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 0.79కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ 1.35కోట్లు. ఈ విధంగా చూసుకుంటే ఇంకా సినిమా 4.21కోట్లు రాబట్టాలి. టాక్ ఇంకాస్త పాజిటివ్ గా ఉంటే ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











