Aa Okkati Adakku Collections అల్లరి నరేష్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ఆ ఒక్కటి అడక్కు కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు సినిమా రంగంలో టాప్ కమెడియన్ హీరో అల్లరి నరేష్, యువ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరి, గౌతమి, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. అంకం మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. గతంలో సూపర్ హిట్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎంత? కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
సమాజంలో పెళ్లి పేరుతో జరుగున్న అరాచకాలు, అక్రమాలను పాయింట్‌గా తీసుకొని కామెడీ చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో యువ, సీనియర్ నటీనటులు, ప్రతిభావంతులైన టెక్నిషియన్స్ నటించారు. ఈ సినిమా అన్ని ఖర్చులు, ప్రమోషనల్ వ్యయంతో కలిపి ఈ సినిమాను 25 కోట్ల రూపాయలతో నిర్మించారు.

అల్లరి నరేష్ చాలా కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉండి.. అలాంటి సినిమాతో వస్తుండటంతో అందరి దృష్టి పెరిగింది. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను దాదాపు 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఆ ఒక్కటీ అడక్కు సినిమాకు మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమాకు మార్నింగ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. గుంటూరులో 55 శాతం, హైదరాబాద్ 35 శాతం, కరీంనగర్ 50 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

ఆ ఒక్కటీ అడక్కు మూవీ తొలి రోజు రెస్పక్టబుల్ కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు, వేసవి తాపాన్ని అధిగమించి మంచి వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ సినిమా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఓవర్సీస్ కలెక్షన్లు కలిపితే ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











